Yakshini OTT: అఫీషియల్: అబ్బాయిలు జాగ్రత్త యక్షిణి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Yakshini OTT: అఫీషియల్: అబ్బాయిలు జాగ్రత్త యక్షిణి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అబ్బాయిలు జాగ్రత్త యక్షిణి వచ్చేస్తుంది అంటూ నెట్టింట చాలా పోస్ట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. అదే హాట్ స్టార్ లో రాబోతున్న యక్షిణి వెబ్ సిరీస్ గురించి. ఇన్ని రోజులు కేవలం పోస్ట్స్ మాత్రమే పెట్టిన హాట్ స్టార్ ఇప్పుడు యక్షిణి ఎప్పుడు వస్తుందో కూడా ప్రకటించింది.

అబ్బాయిలు జాగ్రత్త యక్షిణి వచ్చేస్తుంది అంటూ నెట్టింట చాలా పోస్ట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. అదే హాట్ స్టార్ లో రాబోతున్న యక్షిణి వెబ్ సిరీస్ గురించి. ఇన్ని రోజులు కేవలం పోస్ట్స్ మాత్రమే పెట్టిన హాట్ స్టార్ ఇప్పుడు యక్షిణి ఎప్పుడు వస్తుందో కూడా ప్రకటించింది.

ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రతి వారం ప్రతి ఓటీటీ లో కనీసం మూడు నుంచి నాలుగు సినిమాలు, సిరీస్ లు అయినా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయినా సరే ప్రేక్షకులు ఇంకా కొత్త కంటెంట్ ను కోరుకుంటూనే ఉన్నారు. దీనితో మేకర్స్ కూడా మూవీ లవర్స్ కు తగినట్టుగానే.. సరికొత్త కంటెంట్ తో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లకు ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా హారర్ వెబ్ సిరీస్ లపై ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు హారర్ మూవీ లవర్స్ కోసం హాట్ స్టార్ సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకువచ్చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. మరి యక్షిణి రాబోయేది ఎప్పుడో చూసేద్దాం..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ స్టార్ వరుస పోస్ట్ లతో.. కొత్త వెబ్ సిరీస్ గురించి ఊరిస్తుంది. అబ్బాయిలు జాగ్రత్త యక్షిణి వచ్చేస్తుంది అంటూ పోస్ట్ లు అయితే పెడుతున్నారు కానీ ఇంతకీ యక్షిణి రాబోయేది ఎప్పుడో మాత్రం చెప్పలేదు. దీనితో ప్రేక్షకులంతా ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసినప్పటినుంచి కూడా ఈ సిరీస్ పై అందరికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కొత్త కథనాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి.. విజయం సాధించడంలో హాట్ స్టార్ ఎప్పుడు ముందుంటుంది. ఇక ఈ సిరీస్ కూడా ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎట్టకేలకు ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. యక్షిణి వెబ్ సిరీస్ జూన్ 14 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

కాబట్టి ఈ వెబ్ సిరీస్ ను చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ఇక ఈ వెబ్ సిరీస్ లో నటి వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ‘ఆర్కా మీడియా వర్క్స్’పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించగా.. తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి, మరాఠి భాషల్లో రిలీజ్ చేయనున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల “అబ్బాయి జాగ్రత్త. మీ కోసం త్వరలో యక్షిణి వస్తుంది. ఆమె చివరి వేట త్వరలో ప్రారంభం కాబోతుంది”. అంటూ హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ఈ సోసియో ఫాంటసీ హారర్ వెబ్ సిరీస్ గురించి చేస్తున్న ప్రకటనలు.. తెగ వైరల్ అవుతున్నాయి. మరి యక్షిణి వెబ్ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments