Yakshini Web Series: OTT లోకి వచ్చేసిన రొ*మాంటిక్ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్..

Yakshini Web Series: OTT లోకి వచ్చేసిన రొ*మాంటిక్ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్..

వెబ్ సిరీస్ లంటే అందరికి ఇష్టమే.. అందులోను ఆ వెబ్ సిరీస్ లు తెలుగులో ఉంటె ఇంకాస్త చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగులో హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

వెబ్ సిరీస్ లంటే అందరికి ఇష్టమే.. అందులోను ఆ వెబ్ సిరీస్ లు తెలుగులో ఉంటె ఇంకాస్త చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగులో హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఓటీటీ లో సినిమాలు మాత్రమే కాదు.. ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అందులోను ఇప్పుడు అందరు వెబ్ సిరీస్ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో.. ఇతర భాషల వెబ్ సిరీస్ లు కూడా సాధ్యమైనంత వరకు తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. అలాంటిది డైరెక్ట్ తెలుగులోనే వెబ్ సిరీస్ వస్తే ఇక ఈ సిరీస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇక అందులోను అది ఓ హర్రర్ ఫాంటసీ కథ అయితే.. ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సరికొత్త హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ యక్షిణి ఓటీటీ లోకి వచ్చేసింది.

యక్షిణి వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి.. ఈ సిరీస్ ఎలా ఉండబోతుందా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ను గమనించినట్లతే.. ఈ సిరీస్ లో హర్రర్ ఎలిమెంట్స్ తో పారు.. లవ్ , రొ*మాన్స్ , సస్పెన్స్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు అర్థమైపోయింది. ఇక ఎట్టకేలకు ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 14 నుంచి.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగుతో పాటు… తమిళ, కన్నడ , మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇపుడు ఈ సిరీస్ ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక యక్షిణి సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. అలకాపురి అనే లోకం నుంచి ఒక శాపం వలన యక్షిణి భూమి మీదకు వస్తుంది. భూమి మీదకు వచ్చిన ఆమె వంద మందిని చంపితే కానీ శాప విముక్తి పొందలేదు. ఆ వంద మందిని ఎలా చంపింది. ఆ వందో వ్యక్తి ఎవరు అనేదే ఈ సిరీస్ స్టోరీ లైన్ . కాగా ఈ సిరీస్ లో నటి వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు తేజ మార్ని దర్శకత్వం వహించగా… బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ‘ఆర్కా మీడియా వర్క్స్’పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు . కాబట్టి ఈ వీకెండ్ మీ వాచ్ లిస్ట్ లో ఈ సిరీస్ ను కూడా యాడ్ చేసుకోండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments