Yakshini OTT: OTTలోకి రొ*మాంటిక్ ఫాంటసీ సిరీస్.. అబ్బాయిలే ఆమె టార్గెట్!

Yakshini OTT: OTTలోకి రొ*మాంటిక్ ఫాంటసీ సిరీస్.. అబ్బాయిలే ఆమె టార్గెట్!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రోజు రోజుకి కొత్త కంటెంట్ యాడ్ అవుతుంది. అటు థియేటర్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు లేకపోవడంతో ఇటు ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రోజు రోజుకి కొత్త కంటెంట్ యాడ్ అవుతుంది. అటు థియేటర్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు లేకపోవడంతో ఇటు ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది.

సినిమాలు లేక థియేటర్స్ లో సందడి తగ్గిపోతుంది. కానీ ఓటీటీ లో మాత్రం రోజు రోజుకి కొత్త కంటెంట్ యాడ్ అవుతుంది. రోజు రోజుకి ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. మేకర్స్ కూడా అదిరిపోయే కంటెంట్ తో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో హాట్ స్టార్ ఇప్పటివరకు ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు హాట్ స్టార్ మరొక సారి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సారి ఇంకాస్త స్పెషల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ వెబ్ సిరీస్ మరేదో కాదు.. సోసియో ఫాంటసీ హారర్ వెబ్ సిరీస్ గా తెరకెక్కుతున్న “యక్షిణి” వెబ్ సిరీస్. రొమా*న్స్ , కామెడీ, హార్రర్ ఎలిమెంట్స్ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు మేకర్స్. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. దీనితో త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనికి సంబంధించి హాట్ స్టార్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. ఇక తాజాగా “అబ్బాయి జాగ్రత్త. మీ కోసం త్వరలో యక్షిణి వస్తుంది. ఆమె చివరి వేట త్వరలో ప్రారంభం కాబోతుంది”. అంటూ హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తోంది. దీనితో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఓటీటీ లో లభిస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఇలాంటి కొత్త తరహా కథలతో ముందుకు వస్తున్నారు. పైగా ఈ వెబ్ సిరీస్ ను తెలుగుతో పాటు.. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి, మరాఠి భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సిరీస్ లో నటి వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు తేజ మార్ని దర్శకత్వం వహించగా… బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ‘ఆర్కా మీడియా వర్క్స్’పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయంపైన క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments