2017 లో తమిళ ఇండస్ట్రీ ని సేక్ చేసిన ఒక వివాదాస్పద అంశం సుచీ లీక్స్ మళ్ళీ సంచలనం అయింది. గతంలో ఈ ప్రముఖ సింగర్ సుచీ లీక్స్ అనే పేరిట ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ తమిళ నటుల సంబంచిన కొన్ని ప్రైవేట్ వీడియో లు మరియు, ఫోటో లు విడుదల అయ్యి కలకలం రేపింది. ఇందులో అగ్ర నటుడు ధనుష్, ఆండ్రియా , అమలాపాల్ , త్రిష , హన్సిక , అమీ జాక్సన్ , అనిరుధ్, సింగర్ ఇలా చాలామంది ప్రముఖుల వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఫోటోలు వీడియో లు బయటకి వచ్చాయి. ఈ న్యూస్ తో దేశం లోనే తమిళ ఇండస్ట్రీ అంతా ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సంఘటన తో సింగర్ సుచిత్ర జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది. ఆమె గతం లో ఒక మానసిక వ్యాధితో బాధపడినట్లు తెలిసింది. అంతే కాకుండా తన భర్త కార్తీక్ కుమార్ ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయాడు. దీనితో ఆమె మానసిక ఆరోగ్యం మరింత క్షీణించి చాల మనోవేదనకు గురై కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. ఈమె తమిళ బిగ్ బాస్ లో నాల్గవ సీజన్లో లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి ఒక కాంటెస్ట్ గా కూడా పాల్గొంది. ఇటీవల ఆమె ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ లో కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ముఖ్యంగా ధనుష్ - ఐశ్వర్య విడాకులు, మరియు సూచీ లీక్స్ ఫేస్బుక్ ఖాతా ఇష్యూ తదితర విషయాల పై సుచిత్ర కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ మరియు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. అంతే కాకుండా సూచీ లీక్స్ పేరుతో విడుదల అయిన ఫోటోలు అన్నీ త్రిష నే ఇచ్చిందని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఇపుడు ఆ స్టేట్మెంట్ తో తమిళ సినీ వర్గం లో నిప్పులు చెలరేగుతున్నాయి. సూచీ లీక్స్ పేరుతో వచ్చిన ఫొటోస్ అన్నిత్రిష ఇచ్చిన మాట వాస్తవమే అయిన అవి నెట్టింట్లో, సోషల్ మీడియా లో వైరల్ అయ్యాక 'నేను చాలా హర్ట్ అయ్యాను' అని చెప్తూ త్రిష నే తన ట్విట్టర్ ఖాతాలో లో ట్వీట్ చేసింది. త్రిష ఒక బిచ్. అని సింగర్ సుచిత్ర సెన్సషనల్ స్టేట్మెంట్ పాస్ చేసింది. అంతే కాకుండా సూచీ లీక్స్ లో ఇప్పుడు కొత్తగా త్రిష , అమలాపాల్ మరియు కొంతమంది హీరోయిన్లు తో ధనుష్ ప్రైవేట్ ఫొటోస్ లీకయ్యాయి. అప్పటినుండి ఐశ్వర్య, ధనుష్ మధ్య విబేధాలు వచ్చి చివరకు విడాకులు వరకు వెళ్లి చేసేదేమి లేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ ఇండస్ట్రీ చర్చ కొనసాగుతూ ఉంది.