మెన్స్‌ క్రికెటర్లలానే మహిళా క్రికెటర్లు కూడా గార్డ్‌ ధరిస్తారా?

మెన్స్‌ క్రికెటర్లలానే మహిళా క్రికెటర్లు కూడా గార్డ్‌ ధరిస్తారా?

Women Cricketers Wear Guard: క్రికెట్‌ ఎంతో డేంజరస్‌ గేమ్‌.. చాలా సేఫ్టీ పరికరాలు పెట్టుకుని ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి దిగుతుంటారు. అయితే.. పురుష క్రికెటర్లలా మహిళా క్రికెటర్లు కూడా గార్డ్‌ ధరిస్తారా? అనే అనుమానం అందరికి ఉంటుంది. ఆ డౌట్‌ను క్లియర్‌ చేస్తూ.. యంగ్‌ ఉమెన్‌ క్రికెటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం..

Women Cricketers Wear Guard: క్రికెట్‌ ఎంతో డేంజరస్‌ గేమ్‌.. చాలా సేఫ్టీ పరికరాలు పెట్టుకుని ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి దిగుతుంటారు. అయితే.. పురుష క్రికెటర్లలా మహిళా క్రికెటర్లు కూడా గార్డ్‌ ధరిస్తారా? అనే అనుమానం అందరికి ఉంటుంది. ఆ డౌట్‌ను క్లియర్‌ చేస్తూ.. యంగ్‌ ఉమెన్‌ క్రికెటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం..

ఇటీవల జరిగిన మ్యాచ్ లో గ్రౌండ్ లో సర్ఫరాజ్ ఖాన్ హెల్మెట్ పెట్టుకోలేదని రోహిత్ శర్మ ఆ ఆటగాడి మీద గట్టిగా అరిచిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. క్రికెట్ ఆడుతున్నప్పుడు హెల్మెట్లు, గార్డ్స్ ఎంత అవసరమో. లేదంటే తలకాయలతో పాటు ముఖ్యమైనవి ఇంకేవైనా పగిలిపోయే ఛాన్స్ ఉంది. క్రికెట్ లో బంతిని బ్యాటర్ కొట్టడమే కాదు.. అదే బంతి గ్రౌండ్ లో ఉన్న క్రికెటర్స్ ని కూడా కొడుతుంది. కీపర్స్ ని కొట్టచ్చు, ఫీల్డర్స్ ని కొట్టచ్చు, బ్యాటర్ ని కూడా కొట్టచ్చు. ఆ బంతి శరీరంలో ఎక్కడ తగిలినా ఆ నొప్పిని భరించడం కష్టం. ఇక సున్నిత అవయవాల మీద తగిలితే కళ్ళు బయ్యర్లు కమ్ముతాయి. ఆ క్రికెట్ బంతంటే క్రికెటర్స్ కి భయం.

అందుకే సేఫిటీ కోసం హెల్మెట్స్, ప్యాడ్స్, థై ప్యాడ్స్, కీపర్ ప్యాడ్స్, బ్యాటింగ్ గ్లోవ్స్, కీపింగ్ గ్లోవ్స్ వంటి వాటిని తీసుకొచ్చారు. వీటితో పాటు ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. అదే గార్డ్. ప్రముఖులకు బాడీ గార్డ్స్ ఎలాగో.. క్రికెట్ ఆడే వారికి ఈ గార్డ్స్ అలాగ. ప్రతి క్రికెటర్ ఖచ్చితంగా గార్డ్స్ పెట్టుకోవాల్సిందే. అయితే పైకి కనిపించే ఈ హెల్మెట్లు, ప్యాడ్స్ లానే కనిపించని గార్డ్స్ కూడా ఉంటాయన్న సంగతి తెలిసిందే. బంతి కాళ్ళ మధ్య తగిలినా గాయం అవ్వకుండా ఉండడం కోసం ఈ గార్డ్ ని ధరిస్తారు. అయితే మగ క్రికెటర్స్ మాత్రమేనా గార్డ్స్ పెట్టుకునేది.. మహిళా క్రికెటర్స్ కూడా గార్డ్స్ పెట్టుకుంటారు. మగ క్రికెటర్స్ మాదిరి హెల్మెట్స్, థై ప్యాడ్స్, ప్యాడ్స్ ధరించే మహిళా క్రికెటర్లు కూడా గార్డ్స్ ధరిస్తారు. నడుము కింద, కాళ్ళ మధ్యలో బాల్ తగిలినా గాయం కాకుండా ఉండడం కోసం ఈ గార్డ్ ధరిస్తారు.

అయితే ఇక్కడ మీకు తెలియని ఇంకో గార్డ్ కూడా ఉంది. అదే బ్రెస్ట్ గార్డ్. దీన్ని గ్రోయిన్ గార్డ్ అని కూడా అంటారు. ఇది మహిళా క్రికెటర్స్ రొమ్ములకు.. బంతి తగిలితే గాయం కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మహిళల శరీరంలో ఈ బ్రెస్ట్ అనేది చాలా సున్నితమైనది. బ్రెస్ట్ గార్డ్ లేకుండా మహిళలు క్రికెట్ ఆడితే చాలా ప్రమాదం. వేగంగా వచ్చే బంతి తగిలినప్పుడు గాయం తీవ్రత చాలా దారుణంగా ఉంటుంది. మహిళా క్రికెటర్స్ కి బ్రెస్ట్ గార్డ్స్ లానే మగ క్రికెటర్స్ కి చెస్ట్ గార్డ్స్ ఉంటాయి. ఇవి ఛాతీ, గుండెకు దెబ్బ తగలకుండా రక్షిస్తాయి. మగ క్రికెటర్స్ కి ఎలాంటి సేఫిటీ ఎక్విప్ మెంట్స్ ఉన్నాయో అవన్నీ మహిళా క్రికెటర్లకు కూడా ఉంటాయి. క్రికెట్ లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా లేదు. అందరినీ సమానంగా చూస్తారు అని తెలియజేయడానికి ఈ సేఫిటీ ప్రొడక్ట్స్ ని ఇస్తారు.

Show comments