Why 1-Down, 4/5-Up Pattern In Bikes: బైకులకి ఒక గేరు ముందుకు.. మిగతా గేర్లు వెనక్కి ఎందుకుంటాయో తెలుసా?

బైకులకి ఒక గేరు ముందుకు.. మిగతా గేర్లు వెనక్కి ఎందుకుంటాయో తెలుసా?

Why 1-Down, 4/5-Up Pattern In Bikes: ఒకప్పుడు బైకులకి అన్ని గేర్లు ముందుకు, లేదా అన్ని గేర్లు వెనక్కి వేసేలా ఉండేవి. కానీ ప్రస్తుతం వస్తున్న చాలా బైకులు ఫస్ట్ గేర్ న్యూట్రల్ కింద.. దాని పైన మిగతా గేర్లు ఉంటున్నాయి. అయితే ఇలా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?

Why 1-Down, 4/5-Up Pattern In Bikes: ఒకప్పుడు బైకులకి అన్ని గేర్లు ముందుకు, లేదా అన్ని గేర్లు వెనక్కి వేసేలా ఉండేవి. కానీ ప్రస్తుతం వస్తున్న చాలా బైకులు ఫస్ట్ గేర్ న్యూట్రల్ కింద.. దాని పైన మిగతా గేర్లు ఉంటున్నాయి. అయితే ఇలా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?

ఒకప్పుడు బైక్స్ కి గేర్ షిఫ్టింగ్ అనేది అయితే ముందుకు లేదా వెనక్కి ఉండేది. హీరో హొండా లాంటి బైక్స్ కి నాలుగు గేర్లు వెనక్కి పడితే.. టీవీఎస్ బండికి మాత్రం అన్ని గేర్లు ముందుకు పడేవి. కంపెనీలను బట్టి గేర్ షిఫ్టింగ్ అనేది మారిపోయింది. అయితే ప్రస్తుతం వస్తున్న కొన్ని మోడ్రన్ బైకులు ఫస్ట్ గేర్ ముందుకు ఉండి.. మిగతా 4/5 గేర్లు మాత్రం వెనక్కి ఉంటున్నాయి. అయితే మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇలా ఎందుకు ఉంటాయో అని. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 

ఒక గేర్ ముందుకు, మిగతా గేర్లు వెనక్కి ఉంటే దాన్ని 1-డౌన్, 4/5 అప్ పేటర్న్ అని అంటారు. ఇది గ్లోబల్ గా అంగీకరించబడినది. ఇలా ఉండడం వల్ల న్యూట్రల్ నుంచి ఒకేసారి ఆఖరు గేరుకి వెళ్ళలేరు. ఖచ్చితంగా 1,2,3 ఇలా ఒక్కో గేరు వేసుకుంటూ వెళ్ళాలి. అదే పాత బైకుల్లో అయితే న్యూట్రల్ గేరు తర్వాత వరుసగా మిగతా గేర్లు ఉంటాయి. దీని వల్ల ఒక్కోసారి ఒక గేర్ స్కిప్ అయిపోతుంది. అంటే న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేరుకి వచ్చాక.. సెకండ్ వేయబోతే మూడో గేరు పడుతుంది. దీని వల్ల బండి సడన్ గా ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఇదొక కారణం వల్ల ఇప్పుడు చాలా బైక్స్ ఒక గేరు ముందుకు, న్యూట్రల్ పైన మిగతా గేర్లు పెడుతున్నారు. మరో కారణం కూడా ఉంది. రోడ్డు మీద వేగంగా వెళ్తున్నప్పుడు సడన్ గా వాహనాలు అడ్డుపడినప్పుడు బైక్ స్పీడ్ ని తగ్గించాల్సి వస్తుంది.

దాని కోసం ఫస్ట్ గేర్లు డౌన్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ ఫాస్ట్ గా గేర్లను డౌన్ చేస్తుంటాం. పాత బైకుల్లో లాస్ట్ గేర్ అంటే న్యూట్రల్ కాబట్టి బండి సడన్ గా ఆగిపోతుంది. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదే ఇప్పుడు వస్తున్న బైక్స్ లో కిందకు గేర్లు ప్రెస్ చేస్తే లాస్ట్ గేర్ ఫస్ట్ గేర్ అవుతుంది. దీని వల్ల బైక్ అనేది ఆగదు. అప్పుడే బైక్ నేర్చుకునే బిగినర్స్ కి ఇది కంఫర్ట్ గా, ఈజీగా ఉంటుంది. ప్రమాదాలను నివారించడానికే ఫస్ట్ గేర్, న్యూట్రల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్లు ఈ విధంగా తీసుకొచ్చారు.

ఒకవేళ ఎత్తైన ప్రదేశాలు, కొండల మీద ప్రయాణిస్తున్నప్పుడు పొరపాటున న్యూట్రల్ గేర్ వేస్తే బైక్ ని ఆపడం కష్టం అవుతుంది. ఆ సమయంలో ఫస్ట్ గేర్ వేయాల్సి వస్తుంది. ఫస్ట్ గేర్ వేయాలంటే బ్రేక్ వదలాలి. బ్రేక్ వదిలితే బైక్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వెనక ఏ వాహనమైనా ఉంటే ఇక అంతే పరిస్థితి. అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా గేర్లు షిఫ్ట్ చేసే ప్రాసెస్ లో న్యూట్రల్ గేర్ పడకుండా ఉండడం కోసం లాస్ట్ గేర్ ని ఫస్ట్ గేర్ గా పెడతారు. దీని వల్ల ప్రమాదాలు అనేవి జరగవు. అందుకే న్యూట్రల్ గేర్ ని బండిని పూర్తిగా ఒక చోట ఆపినప్పుడు తప్పితే జర్నీలో ఉండగా వాడకూడదు. 

Show comments