WhatsApp Adds 3 New Features: వాట్సాప్‌లో 3 సరికొత్త ఫీచర్స్.. ఇది కదా యూజర్స్‌కి కావాల్సింది!

వాట్సాప్‌లో 3 సరికొత్త ఫీచర్స్.. ఇది కదా యూజర్స్‌కి కావాల్సింది!

WhatsApp Adds 3 New Features: వాట్సాప్ అనేది ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు నిత్యావసర సరుకుగా మారిపోయింది. వాట్సాప్ లేకపోతే చాలా పనులు జరగవు. ఆర్థిక వ్యవహారాలన్నీ వాట్సాప్ తోనే ముడిపడి ఉన్నాయి. అందుకే వాట్సాప్ కూడా యూజర్స్ కోసం అనేక ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ మరో మూడు ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

WhatsApp Adds 3 New Features: వాట్సాప్ అనేది ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు నిత్యావసర సరుకుగా మారిపోయింది. వాట్సాప్ లేకపోతే చాలా పనులు జరగవు. ఆర్థిక వ్యవహారాలన్నీ వాట్సాప్ తోనే ముడిపడి ఉన్నాయి. అందుకే వాట్సాప్ కూడా యూజర్స్ కోసం అనేక ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ మరో మూడు ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

వాట్సాప్ అనేది వందల కోట్ల ప్రజల జీవితాల్లో ముఖ్య సాధనం అయిపోయింది. వాట్సాప్ లేకపోతే  రోజు గడవని పరిస్థితి. పనులు జరగని పరిస్థితి. ఎక్కడకి వెళ్తున్నా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే ఇతరులతో వాట్సాప్ అనేది కలుపుతుంది. వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ అవుతున్నారు. అయితే వాట్సాప్ వచ్చినప్పటి నుంచి అనేక అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సరికొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంది. వాట్సాప్ లోని టెక్స్ట్ లకే పరిమితం కాకుండా.. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కి సంబంధించి కూడా అనేక ఫీచర్స్ ని తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్ 3 సరికొత్త ఫీచర్స్ ని తీసుకురానుంది. దీంతో వాట్సాప్ కాలింగ్ అనుభూతి మరింత ఉత్తమంగా ఉండనుంది. 

స్క్రీన్ షేరింగ్: 

వాట్సాప్ రీసెంట్ గా షేర్ చేసిన బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ఆడియోతో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ని వాట్సాప్ లో యాడ్ చేయనున్నారు. దీని వల్ల వాట్సాప్ లో మీరు స్క్రీన్ ని షేర్ చేస్తున్న వ్యక్తితో మాట్లాడేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ని బీటా వెర్షన్ లో టెస్ట్ చేశారు. ఇప్పుడు అది అందరికీ అందుబాటులోకి రానుంది. ఇది నేర్చుకునేందుకు, టీములు కలిసి పని చేసుకునేందుకు, స్నేహితులతో కలిసి కంటెంట్ ని చూసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. 

గ్రూప్ వీడియో కాల్:

మరో ఫీచర్ ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో గ్రూప్ వీడియో కాల్ లో 32 మంది వినియోగదారులను యాడ్ చేసుకోవచ్చు. అది ఏ డివైజ్ అయినా సరే ఈ ఫీచర్ పని చేస్తుంది. అంటే ఒకేసారి 32 మంది కలిసి స్క్రీన్ ని పంచుకోవచ్చు. అంతేకాదు గ్రూప్ కాల్ లో ఎవరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని హైలైట్ చేస్తుంది. దీని వల్ల కన్ఫ్యూజన్ లేకుండా సులువుగా మాట్లాడే వ్యక్తిని గుర్తించవచ్చు. 

నాయిస్ క్యాన్సిలేషన్: 

సరైన నెట్వర్క్ లేకపోయినా సరే వాయిస్ కాల్స్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా ఎంలో కోడెక్ ని వాట్సాప్ లాంఛ్ చేసింది. దీని వల్ల బయట నుంచి వచ్చే నాయిస్ ని తొలగించి.. స్పష్టమైన వాయిస్ ని అందిస్తుంది. ఇక నెట్వర్క్ బాగుంటే కనుక హై క్వాలిటీ వీడియో కాల్స్ ని ఆస్వాదించవచ్చు.     

ఈ కొత్త ఫీచర్స్ మరికొన్ని వారాల్లో వాట్సాప్ లో అప్డేట్ కానున్నాయి. ఈ ఫీచర్స్ తో యూజర్స్ కి మెరుగైన అనుభూతి కలుగుతుంది. దీనికి తోడు ఈ కొత్త ఫీచర్స్ తో పలు వ్యాపార సంస్థలకు, కంపెనీలకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. 

Show comments