పచ్చి బఠానీలతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పచ్చి బఠానీలలో ఎన్ని పోషకాలు ఉంటాయో మీకు తెలుసా? అవి తింటే ఆ సమస్యలు మీ దరికి చేరవు.

ఒక కప్పు పచ్చి బఠానీల్లో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం.

ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల రక్తంలో చెక్కర స్థాయిలు పెరగవు.

ఇవి తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి.ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.

పచ్చి బఠానీలు గుండెకు చాలా మంచివి. ఇందులో ఉండే పొటాషియం రక్త పోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను వివారించడానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

పచ్చి బఠానీల్లో మాంగనీస్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది.

ఈ మూలకాలు ఎముకలను రక్షించడంలో సహాయపడతాయి.

అయితే ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని ఎక్కువ.. తక్కువ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని వైద్యులు చెబుతున్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం