రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ట్రైన్ జర్నీ చేస్తుంటారు.

రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు రైల్వే నియమాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.

రైలు ప్రయాణికులు నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్షలకు గురికావాల్సి వస్తుంది.

మిడిల్ బెర్తును బుక్ చేసుకుంటే దానికి టైం పిరియడ్ ఉంటుంది.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్ ను తిరస్కరించకూడదు.

ట్రైన్ మిస్ చేసుకున్నప్పుడు మీ సీటును 2 స్టేషన్లు లేదా 1 గంటపాటు ఎవరికీ కేటాయించరు.

ఆ తర్వాత టీటీఈ మరొకరికి కేటాయిస్తారు.

రైల్వే నియమాల ప్రకారం టీటీఈ రాత్రి 10గంటల తర్వాత ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు.

రైలు ప్రయాణం చేసేటపుడు పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

కారణం లేకుండా చైన్ లాగితే జరిమానా, జైలు శిక్ష పడొచ్చు.

రాత్రి 10 గంటల తర్వాత తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా మ్యూజిక్ ప్లే చేస్తే రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటారు.

ఈ-టికెట్ వెయిటింగ్ లిస్టులో ప్రయాణించడానికి అనుమతి ఉండదు