Off-white Banner

ఓటరు లిస్ట్ లో  మీ పేరు తొలగించినా ఓటేయవచ్చు! ఎలా అంటే..

భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ.. కాబట్టి పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడతారు

అర్హులైన పౌరులందరికి ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పిస్తుంది.

ప్రతి పౌరుడూ ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఈసీ అనేక సౌకర్యాలు కల్పించింది.

ముఖ్యంగా ఓటర్ల జాబితాను రూపొందించే విషయంలో అనేక కార్యక్రమాలు చేస్తుంది

కొన్ని కారణాలతో ఓటరు జాబితాను నుంచి కొన్ని పేర్లు తొలగించబడుతుంటాయి.

అలా ఓటరు జాబిత నుంచి పేరు తొలగించనబడిన వారు కూడా ఓటు వేయవచ్చు

అధికారులు తనిఖీకి వచ్చిన సమయంలో లేని ఓటర్ల పేర్లతో ప్రత్యేక జాబితాను తయారు చేస్తారు.

అలా ఓటర్ల నుంచి సేకరించిన జాబితాలన్నీ ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటుంది.  

ఎవరైన ఓటు వేసేందుకు వెళ్లి.. అక్కడ లిస్ట్ లో పేరు లేకపోయినా ఓటు వేయవచ్చు

ఎలా అంటే.. ఓటరు జాబితాలో లేని పేరును ASD ఓటర్ల లిస్ట్ లో వెతకాలి.

ఏఎస్డీ ఓటర్ల జాబితాలో పేరుంటే ఆ వ్యక్తి  గుర్తింపు కార్డుతో ప్రిసైడింగ్‌ అధికారి నిర్ధారించుకుంటారు.

ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకం, వేలిముద్ర  తీసుకుంటారు.

పోలింగ్ కేంద్రంలో ఉండే అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు.

ఆ వ్యక్తి నుంచి నిర్దిష్ట ఫార్మాట్‌లో సమాచారం తీసుకున్న ఓటు వేసే ఛాన్స్ కల్పిస్తారు.