ఈ దేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తో తిరగొచ్చు! అవేంటంటే?

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది. అయితే వాటిని కొన్ని కండిషన్స్ అండ్ టర్మ్స్ ఉంటాయి.

యూనైటెడ్ స్టేట్స్ లో ఒక సంవత్సరం వరకు ఇండియన్ లైసెన్స్ తో ట్రావెల్ చేయోచ్చు. అయితే ఐ-94 ఫామ్ ను మన వెంటతీసుకెళ్లాలి. దాన్ని అధికారులు చెక్ చేస్తారు.

ఇంగ్లండ్, వేల్స్, స్కాంట్లాడ్ అండ్ నార్తెరన్ ఐర్లాంగ్ లో కూడా ఒక సంవత్సరం వరకు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తో తిరగొచ్చు.

 స్విట్జర్ లాండ్ లో కూడా ఇండియన్ లైసెన్స్ ను వన్ ఇయర్ వరకు అంగీకరిస్తారు.

వీటితో పాటుగా ఫ్రాన్స్, మలేసియా దేశాల్లో కూడా ఇండియన్ లైసెన్స్ పనిచేస్తుంది.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్ ల్యాండ్, సౌత్ ఆస్ట్రేలియాలో ఒక సంవత్సరం ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది.

అయితే నార్తెరెన్ ఆస్ట్రేలియాలో మాత్రం మూడు నెలలే ఈ లైసెన్స పనిచేస్తుంది. ఈ ప్రాంతాల్లో తిరగాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్(IDP) ఉండటం మంచిది.

జర్మనీలో ఆరు నెలల పాటు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది. ఆ తర్వాత జర్మనీ లైసెన్స్ తీసుకోవాలి. లేదా IDP ఉండాలి.

న్యూజిలాండ్ కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కు ఏడాది పాటు అవకాశం కల్పించింది. ఆ తర్వాత తిరగాలంటే అక్కడి లైసెన్స్ లు తీసుకోవాల్సిందే.

భూటాన్ లో తిరిగేందుకు, డ్రైవింగ్ చేసేందుకు భారతీయులకు అనుమతి ఉంది. అయితే ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ తీసుకెళ్లాలి.

సింగపూర్ లో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది. కాకపోతే.. 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

సౌతాఫ్రికా, స్వీడన్ లో కూడా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది.