Tooltip

ఈ ఆహార పదార్ధాలతో.. మహిళలను వేధించే రక్తహీనత సమస్యలకు చెక్!

మన దేశంలో ఎంతో మంది స్త్రీలు,పిల్లలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు.

ఈ రక్తహీనత సమస్యను ఎనీమియా  అని అంటారు.

ఈ సమస్య ఉన్న వారిలో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది

 తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించాలి.

ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. 

పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ ప్రతిరోజూ ఆహారంలో ఉపయోగించాలి. 

అరటి పండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలో  అధిక మొత్తంలో ఐరన్ లభిస్తుంది. 

క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ ను ప్రతిరోజూ తాగితే.. త్వరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

బీట్ రూట్ రక్తంలో ఉండే  ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతుంది.

శరీరానికి కావలసిన తాజా ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. 

రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ ఆహార పదార్ధాలను తీసుకుంటే మంచిది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం