వంటింట్లో దొరికే లభించే జీలకర్రతో.. ఒంట్లో రోగాలన్నీ మటుమాయం

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది.

మన ఒంట్లో అనేక రోగాలకు మందు మన వంటింట్లోనే ఉన్నాయి. కానీ పెద్దగా పట్టించుకోము.

వాటిల్లో ఒకటి జీలకర్ర. చిన్నగా ఉందని తేలిగ్గా తీసేయండి. దీనిలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు.

జీలకర్రను ప్రతి రోజూ  వంటల్లో భాగం చేసుకుంటున్నాం. పోపులతో పాటు పౌడర్ చేసి.. కూరల్లో వాడుతుంటాం

జీలకర్రతో చాలా ప్రయోజనాలున్నాయి. పైత్య రోగాలను నివారిస్తుంది.

ఇందులో విటమిన్ B 6, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తుంటాయి.

మజ్జిగలో జీలకర్ర పౌడర్ తాగితే.. నులిపురుగులను నివారిస్తుంది

కషాయంగా కాచుకొని తాగితే.. గుండె సంబంధిత సమస్యలను అరికడుతుంది

చర్య సమస్యలను తగ్గిస్తుంది. తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి వ్యాధులను మటుమాయం చేస్తుంది

మూత్ర సంబంధిత సమస్యలను నివారించే శక్తి జీలకర్రకు ఉంది

శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గించి.. మధు మేహాన్ని అదుపులో ఉంచుతుంది

జీర్ణ సంబంధిత సమస్యలకు చక్కని ఔషధం ఈ  జీలకర్ర

గోరు వెచ్చని నీటిలో పౌడర్ వేసుకుని తాగితే బరువు తగ్గుతారు.

ముఖ్యంగా ఎసిడిటీ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది

జ్ఞాపకశక్తిని మెరుగు పరిచే శక్తి జీలకర్రకు ఉంది

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం