చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు టిప్స్

దాహమున్నా లేకున్నా కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగండి.

స్నానానికి, తలస్నానానికి మరీ ఎక్కువ వేడి నీటిని వాడకండి.

స్నానం చేసి తడి చర్మం పైననే మాయిశ్చరైజర్ రాసుకోవడం అలవాటు చేసుకోండి.

చర్మాన్ని పొడిబారేలా  చేసే సబ్బులను వినియోగించకూడదు.

దీన్నికన్న బాడీ వాష్ లు వాడటం ఉత్తమం.

చలికాలంలో కూడా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. 

పెదవులు పొడి బారకుండా లిప్ బామ్, వాడాలి. 

కాళ్లకు, చేతులకు కాటన్ తో చేసిన తొడుగులు ధరించాలి

నూలు బట్టలు, ముదురు రంగు దుస్తులు ధరించాలి. 

రూమ్ హీటర్లు వాడే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. మరీ వేడిగా ఉండకుండా చూసుకోవాలి.

వీలైనంత వరకూ చర్మానికి సంబంధించిన కాస్మెటిక్ ట్రీట్‌మెంట్లకు చలికాలంలో దూరంగా ఉండండి.

హజమైన నూనెలు (కొబ్బరినూనె, ఆలివ్ నూనె, ఆవనూనె, కుసుమ నూనె) చర్మానికి వాడండి