చుండ్రు, జుట్టు రాలటం తగ్గాలంటే ఇలా స్నానం చేయండి!

చలికాలం చర్మ సమస్యలు రావటం సర్వసాధారణం. 

ముఖ్యంగా చలికాలంలో చాలా మందిని చుండ్రు వేధిస్తుంటుంది. 

చుండ్రు కారణంగా జట్టు ఊడిపోతూ ఉంటుంది. 

ఇలా చుండ్రు కారణంగా జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఈ నియమాలు పాటించాలి.

ప్రతీ రోజూ తల స్నానం చేయకూడదు.

వారానికి  రెండు లేదా మూడు సార్లు మాత్రమే తల స్నానం చేయాలి.

స్నానం చేసే ముందు కచ్చితంగా నూనె రాసుకోవాలి. 

నూనె తలకు రాసిన తర్వాత ఎక్కువ సేపు అలానే ఉండకూడదు.

వెంట్రుకలపై పోసే నీళ్లు వేడిగా ఉండకూడదు.

గోరు వెచ్చగా కానీ, చల్లగా గానీ ఉండాలి.

ఎక్కువ గాఢత ఉన్న సాంపూలను వాడకూడదు.

న్యాచురల్‌ కండీషనర్‌ను వాడటం వల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది.