Tooltip

వేసవిలో చియా సీడ్స్‌ ఎందుకు ప్రత్యేకం! ఆరోగ్యాన్ని కాపాడే సీక్రెట్!

వేసవి కాలంలో చలువ చేసే పదార్ధాలు తీసుకోవడానికి ఇష్టపతారు.

సమ్మర్ సీజన్ లో ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో రకాల పోషకాలు అవసరం.

డైట్ లో ఉన్నపుడు మిల్క్ షేక్ లో వేసుకొని తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

చియా సీడ్స్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు

ఇందులో ఫైబర్, ఖనిజాలు, ప్రొటీన్లు శరీరానికి మేలు చేస్తాయి.

చియా సీడ్స్ గుండె సమస్యలు, బరువు తగ్గడానికి, బలిష్టమైన ఎముకలను నిర్మించడానికి ఉనయోగపడతాయి.

 ఈ గింజల్లో ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్, రక్త పోటు స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

చియా సీడ్స్ లో ఫైబర్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అధిక శాతం ఉండటం వల్ల రక్తంలోని చక్కర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.

ఈ గింజలు టైప్ 2 డయాబెటీస్  ని కంట్రోల్ చేస్తుంది. జ్ఞాపక శక్తిని మెరగు పరుస్తుంది.

ఈ గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం లాంటి పోషకాలు ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

 ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మపు మంట, సూర్యరశ్మి లో దెబ్బతినకుండా చర్మాన్ని రక్షిస్తుంది.

ఈ గింజలు క్యాన్సర్ ప్రమాదం నుంచి రక్షిస్తుంది.

గమనిక: ఇది కేవలం అవగాహనం కోసం మాత్రమే.. పూర్తి వివరాల కోసం వైద్యులను సంప్రదించండి.