EVMలో ఎవరి గుర్తులు ముందుంటాయి.! ఎంపిక విధానం ఇదే..!

మే13 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇదే సమయంలో ఒక్కొక్క పార్టీకి అభ్యర్థికి ఒక్కొక్క నియోజవర్గంలో వరుస క్రమం మారుతుంది.

దీంతో ఎందుకు ఇలా నెంబర్ మారుతుందనే  సందేహం చాలా మందిలో వ్యక్తమవుతుంది.

ఈవీఎంలో వివిధ పార్టీల అభ్యర్థుల కూర్పు ఎలా ఉంటుదనేది చాలా మందికి తెలియదు

ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన, జాతీయ, రాష్ట్ర పార్టీల గుర్తులే ఉంటాయి.

అలానే రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం ప్రాధాన్యక్రమం ఎంచుకున్న కేటాయిస్తారు.

ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఓకే గుర్తును కోరితే..లక్కీ డ్రా విధానాన్ని అనుసరిస్తారు

ఈవీఎంలో అభ్యర్థుల వరుస క్రమాన్నికి ఎన్నికల అధికారులు ఓ విధానాన్ని అనుసరిస్తారు.

నామినేషన్ పత్రాల్లో రాసిన తెలుగు అక్షరమాల ప్రకారం కేటాయిస్తారు

మొదటి క్రమంలో ఎన్నికల సంఘం వద్దు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థలవి మొదటి వరుసలో ఉంటాయి.

తదుపరి వరుస క్రమంలో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తారు.

అలా ప్రధాన పార్టీలు, తరువాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లతో ఈవీఎంల్లో కూర్పు చేస్తారు.