Off-white Banner

తెల్ల ఉల్లి.. ఆసమస్యలన్నింటికి దివ్యౌషధం

మన దగ్గర ఒక సామెత ఉంటుంది.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.

ఇక ఉల్లిలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. అవి మన శరీరానికి ఎంతో మేలుచేస్తాయి, అసలు ఉల్లిపాయ లేకుండా మనం ఏ కూర వండము.

ఇక చాలా మంది వేసవి అనే కాకుండా.. ప్రతి రోజు మజ్జిగ, పెరుగులో ఉల్లిపాయ నంజుకుంటారు.

ఇక ఉల్లిలో  రెండు రకాలుంటాయి. ఒకటి  ఎర్ర ఉల్లిగ‍డ్డ, మరొకటి తెల్లది,చాలా మంది ఎర్ర ఉల్లిగడ్డలను వినియోగిస్తుంటారు.

ఎర్ర ఉల్లిలో మాదిరే తెల్ల ఉల్లిపాయలో కూడా ఎన్నో పోషకాలు దాగున్నాయి అంటున్నారు,తెల్ల ఉల్లిపాయ తినడం వల్ల.. జీర్ణవ్యవస్థ బలపడుతుంది. 

ఎందుకంటే దీనిలో అధిక మొత్తంలో ఫైబర్‌ ఉంటుంది,దాంతో పాటు దీనిలో ప్రీబయోటిక్‌ కూడా ఉంటుంది. 

ఇవి జీర్ణవ్యవస్థను కాపాడి.. పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి,తెల్ల ఉల్లిపాయ జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. 

చుండ్రు సమస్యతో బాధపడే వారు.. తెల్ల ఉల్లి రసాన్ని వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది,తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారు ప్రతి రోజు తెల్ల ఉల్లి తింటే మంచిదంటున్నారు.

శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో తెల్ల ఉల్లి ఎంతో ప్రయోజనకారి,చెడు కొలెస్ట్రాల్‌ సమస్య ఉన్న వారు ప్రతి రోజు తెల్ల ఉల్లి తింటే.. నియంత్రణలో ఉంటుంది.

తెల్ల ఉల్లి గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, దీనిలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లు రక్తపోటును పెరగకుండా చూస్తాయి. 

రక్తం గడ్డకట్టడాన్ని తెల్ల ఉల్లి నిరోధిస్తుంది,అందుకే గుండె సమస్యలున్నవారు తెల్ల ఉల్లి తింటే మంచిది అంటున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం