Thick Brush Stroke

AC ఆన్ లో ఉన్నప్పుడు.. FAN వాడటం లాభమా? నష్టమా?

భాగ్యనగరం వాసులు  భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు.

ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వేసవితాపానికి బెంబేలెత్తిపోతున్నారు.

నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచే సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు.

ఇప్పటి నుంచే అందరూ ఏసీలకు పని చెప్పడం స్టార్ట్ చేశారు.

అయితే రెగ్యులర్ గా ఏసీ వాడే వాళ్లు ఓకే. సీజనల్ గా ఏసీ వాడేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సమ్మర్ కి ఏసీ ఆన్ చేసే ముందు దానిని ప్రోపర్ గా సర్వీసింగ్ చేయించుకోవాలి.

సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల ఏసీ కూలింగ్ వస్తుంది, కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.

అయితే చాలామందికి  ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ వేసుకోవడం అలవాటు.

అలా చేయడం వల్ల లాభమా? నష్టమా?  అనే విషయం కూడా తెలియదు.

ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకోవడం లాభమనే చెప్పాలి.

అలా ఫ్యాన్ ఆన్ చేయడం వల్ల రూమ్ చాలా త్వరగా కూల్ అవుతుంది.

ఫ్యాన్ వల్ల ఏసీ గాలి కూడా చక్కగా తగులుతుంది.

ఫ్యాన్ వల్ల ఏసీ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.

ఫ్యాన్ గాలితో రూమ్ త్వరగా కూల్ అయితే కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.

అయితే ఫ్యాన్ టాప్ స్పీడ్ లో కాకుండా.. తక్కువ స్పీడ్ లో పెట్టుకుంటే మంచిది.