జొన్న రొట్టె vs గోధుమ రొట్టె.. రెండింట్లో ఆరోగ్యానికి ఏది మంచిది?

iDreampost.Com

బరువు తగ్గాలనే ప్రయత్నంలో చాలా మంది రకరకాల ఫుడ్స్ ట్రై చేస్తుంటారు.

iDreampost.Com

వెయిట్ లాస్ అయ్యే ప్రయత్నంలో అన్నం బదులు జొన్న, గోధుమ రొట్టెలు తింటుంటారు. అయితే ఈ రెండింట్లో ఏది హెల్దీ అని తెలుసుకోవడం ముఖ్యం.

iDreampost.Com

 జొన్న రొట్టెలతో పాటు జొన్న పిండితో చేసిన వంటకాలు ఏవైనా ఈజీగా జీర్ణమవుతాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.

iDreampost.Com

చిరుధాన్యాల్లో ఒకటైన  జొన్నల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

iDreampost.Com

గోధుమ పిండితో చేసిన రొట్టెల కంటే జొన్న రొట్టెలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. సగటున ఒక జొన్న రొట్టెలో 1.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

iDreampost.Com

జీర్ణశక్తిని మెరుగుపర్చేందుకు ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది.

iDreampost.Com

జొన్నల్లో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఎంతో మంచి చేస్తుంది.

iDreampost.Com

జొన్న రొట్టెలు తరచూ తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

iDreampost.Com

ఇందులోని నియాసిన్, థయామిన్, రిబోఫ్లోవిన్ లాంటి బీ-కాంప్లెక్స్ విటమిన్స్ శక్తిని పెంచుతాయి.

iDreampost.Com

గోధుమలతో పోలిస్తే జొన్నల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగర్ ను కంట్రోల్ చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది.

iDreampost.Com

షుగర్ ను కంట్రోల్ లో ఉంచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ జొన్నలు ఉపయోగపడతాయి.

iDreampost.Com

జొన్న పిండితో చేసిన పదార్థాలు తరచూ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

జొన్నల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ శరీరంలో వాపును తగ్గించడంలో సాయపడతాయి.

iDreampost.Com

గోధుమ రొట్టెలతో పోలిస్తే జొన్న రొట్టెలు చాలా బెటర్ అని..  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున ఇవి తీసుకోవడం బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం