Tooltip

బోన్ బ్రాత్ సూప్ అంటే ఏమిటో.. త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా !

Tooltip

సాధారణంగా మెరుగైన ఆరోగ్యం కోసం అందరూ ఘన ఆహార పదార్ధాలనే ఎంచుకుంటారు.

Tooltip

లిక్విడ్ ఫుడ్స్ ద్వారా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. వాటిలో ఒకటి సూప్స్. 

Tooltip

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సూప్ పేరు బోన్ బ్రాత్ సూప్..

Tooltip

బోన్ బ్రాత్ సూప్ అంటే.. ఎముకలను ఎక్కువసేపు ఉడకబెట్టి చేసే సూప్‌. 

Tooltip

చికెన్‌, బీఫ్‌, చేపలు, కూరగాయలు, మూలికలను నీటిలో వేసి.. 12నుంచి 48 గంటల పాటు చిన్న మంట మీద ఉడకబెడుతూ ఉంటారు. 

Tooltip

అలా స్లో గా ఉడికే ప్రక్రియలో వాటి నుంచి అనేక రకాల పోషకాలు ఆ నీటిలోకి విడుదల అవుతాయి. 

Tooltip

దీనిని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలేంటో చూసేద్దాం.  

Tooltip

బోన్‌ బ్రాత్‌లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, కొల్లాజెన్‌ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

Tooltip

కీళ్ల నొప్పులు తగ్గించడానికి, కీళ్ల సంబంధిత వ్యాధులను నయం చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 

Tooltip

బోన్‌ బ్రాత్‌లో ఉండే జెలటిన్‌ వలన జీర్ణవ్యవస్థ తీరు  ఆరోగ్యంగా ఉంటుంది.

Tooltip

శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 

Tooltip

ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోసం బోన్ బ్రాత్ సూప్ ను తీసుకుంటే ఎంతో మంచిది 

Tooltip

హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికీ ఈ సూప్ సహాయపడుతుంది. 

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం