రాత్రి పడుకునే ముందు బెల్లం తింటే..ఏం జరుగుతుందో తెలుసా!

ఆయుర్వేదంలో బెల్లం దివ్యౌషధంగా పరిచేస్తుంది.

అందుకే రాత్రి భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే అమృతంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇందులోప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు  ఉన్నాయి. 

 అలాగే రాత్రిపూట బెల్లం తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.

ఇక రాత్రిపూట బెల్లం తింటే జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి.

రోజు బెల్లం తినాలేని వారు పాలలో బెల్లం వేసుకుని తాగటం కూడా చాలా మంచిది.

ఈ బెల్లం చర్మానికి కూడా మేలు చేస్తుంది.

అందుచేత ప్రతిరోజూ కొద్దిగా బెల్లం తీసుకోవడం వల్ల మొటిమలను దూరం చేసుకోవచ్చు.

అలాగే ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంతో పాటు చర్మం లోపల నుండి రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.

ఇక బెల్లంలో పొటాషియం ఉంటుంది.ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్క తింటే మలబద్ధకం సమస్య నయమవుతుంది.