Tooltip

ఒకే బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం.

ఈ సమాజం కొనసాగలంటే.. పెళ్లి తప్పనిసరి.

ఇక పెళ్లి సంబంధాల విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసేవారు.

అంటే సంబంధం కలుపుకోబోయే వాళ్ల ఆర్థిక, సామాజిక పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేవారు.

ఇక పెళ్లి అంటే జాతకాలు కలవాల్సిందే అని భావించే వారు నేటికి కూడా కోకొల్లలు.

ఇక నేటి కాలంలో జాతకాలు, ఆర్థిక పరిస్థితులు మాత్రమే కాక.. 

కాబోయే భాగస్వామి బ్లడ్‌గ్రూప్‌ గురించి తెసుకుంటున్నారు. 

ఎందుకంటే భార్యాభర్తిలిద్దరిది ఒకే బ్లడ్‌ గ్రూప్‌ అయితే సమస్యలు వస్తాయనే అపోహ ఉంది.

అయితే ఇది నిజం కాదు అంటున్నారు నిపుణులు. 

ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కూడా ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చునని చెబుతున్నారు నిపుణులు 

భార్యాభర్తలిద్దరికి ఒకే బ్లడ్ గ్రూప్ ఉండటం వల్ల వారికి పుట్టబోయే పిల్లలకు ఎలాంటి సమస్యలు రావంటున్నారు  

ఎలాంటి అనుమానాలు లేకుండా వివాహం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. 

అయితే మేనరికం వివాహాలు వేరని.. వాటి వల్ల వచ్చే సమస్యలు భిన్నం అంటున్నారు.

మేనరకం కాకుండా.. ఒకే బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారు వివాహం చేసుకోవచ్చని అంటున్నారు.

అయినా మీకు ఇంకా నమ్మకం కలగకపోతే.. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులని సంప్రదించమంటున్నారు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏవైనా సందేహాలుంటే నిపుణులని సంప్రదించాలి.