రాత్రిపూట కాఫీ, టీ లు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

చాలా మంది ఉదయం నిద్ర లేవగానే కప్పు టీ లేదా కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు.

అయితే టీ, కాఫీలు తాగడం మంచిదే కానీ ఎప్పుడు పడితే అప్పుడు తాగడం అస్సలు మంచిది కాదు.

కొందరికి రాత్రిపూట కూడా టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. రాత్రిపూట టీ కాఫీలను అస్సలు తాగకూడని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మాములుగా ఒక కప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది.

ఎక్కువగా మన శరీరంలోకెఫీన్ చేరడం వల్ల మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. దీనివల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

రాత్రిపూట టీ కాఫీలు అస్సలు తాగకూడదు, రాత్రి పూట మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది.

ఇది కేవలం రాత్రి పూట మాత్రమే విడుదల అవుతుంది. ఈ హార్మోన్ రాత్రి పూట విడుదల అయితేనే నిద్ర వస్తుంది.

రాత్రి పూట టీ కాఫీలు తాగితే నిద్ర రావడానికి ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల కాదు. దీని వల్ల మనకు నిద్ర పట్టదు. దాని వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.

కాఫీ కానీ టీ కానీ తాగగానే రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. ఉత్సాహం వస్తుంది. అయితే ఈ స్టిములేషన ఒక గంట మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే నరాల వ్యవస్థ బలహీనం అవుతుంది.

నరాల వ్యవస్థను అతిగా ఉద్రేక పరచడం ఆ తర్వాత ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టీ కాఫీలను ఎక్కువగా తాగకూడదు.