ధనియాల నీళ్లను  ఉదయాన్నే త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా!

మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ధనియాలు  కూడా ఒకటి. 

సహజంగా వీటిని పొడిగా చేసి వంటల్లో వాడుతూ ఉంటారు. 

అయితే దానితో పాటు  వీటితో నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 

ఒక గ్లాస్ నీటిలో ధనియాలు వేసి రాత్రంతా నానబెట్టి..ఉదయాన్నే ఈ నీటిని మరిగించి వడకట్టి తాగాలి.

 ఆ నీటిని  తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ నీటిని తాగడం వల్ల ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, సి, కె వంటి పోషకాలు లభిస్తాయి. 

అలాగే రోజూ ఉదయం పరగడుపున ధనియాల నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

అంతేకాకుండా  ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

అలాగే ధనియాల్లో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.