మీరు సిగరెట్ మానేయాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి..

మనిషి ఆరోగ్యం అనేది ఎంతో ప్రధానమైనది అనే విషయం అందరికి తెలిసిందే.

అయితే వివిధ కారణాలతో మనిషి అనారోగ్యానికి గురవుతుంటారు.

మనిషి అనారోగ్యానికి కారణమైన చెత్త అలవాట్లలో ధూమపానం ఒకటి.

ప్రపంచంలో క్యాన్సర్ కు ప్రధాన కారణాల్లో పొగాకు ఒక ముఖ్యమైనది.

ధూమపానం వలన కలిగే నష్టాలు తెలిసిన కూడా చాలా మంది మానేయ లేకపోతున్నారు.

ధూమపానం మానేయడానికి కొన్ని చిట్కాలు నిపుణులు చెబుతున్నారు.

సిగరెట్ తాగాలని ఆలోచన వచ్చినప్పుడు చక్కెర లేని చూయింగ్ గమ్ వేసుకోవడం మేలు.

చూయింగ్ గమ్ ధూమపానం చేయాలనే ఆలోచన నుండి మీ దృష్టిని మళ్లిస్తుంది.

టెన్షన్ లేదా ఒత్తిడి ఉన్నప్పుడల్లా సిగరెట్ తాగాలనిపిస్తోంది.

అలా ఒత్తిడిగా ఉన్నప్పుడు శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నించండి.

అలానే యోగా చేయడం ద్వారా కూడా ధూమపానం నుంచి బయటపడొచ్చు.

ధూమపానం మానేయడంలో డ్రై క్యారెట్ చాలా ఉపయోగ పడతాయని నిపుణులు తెలిపారు.

24 గంటల పాటు ధూమపానం చేయనందుకు మీరే రివార్డ్ చేసుకోండి.

ఇలా వివిధ చిట్కాలు పాటించడంతో ధూమపానం మానేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.