పెరిగిపోతున్న ఉష్ట్రోగ్రతలు.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

ఫిబ్రవరి రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.

ఇప్పటి నుంచే ఎండాకాలం భావన కలుగుతోంది.

ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అత్యవసరం అయితే తప్ప ఎండలో బయటకు వెళ్లకండి.

ఒంటిని హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు.. తరచు నీళ్లు తాగుతూ ఉండాలి.

మజ్జిగ, ఫ్రూట్ జ్యూసులు తాగితే కాస్త ఉపశమనం లభిస్తుంది.

పుదీనా వాడకాన్ని పెంచితే.. బయట కాస్త వేడిగా ఉన్నా శీరరం చల్లగా ఉంటుంది.

ఎండాకాలాన్ని తట్టుకోవాలంటే సరైన వస్త్రధారణ కూడా ఉండాలి

ఈ ఎండలకు కాటన్ వస్త్రాలను ధరిస్తే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది.

మధ్యాహ్నం బయటకు వెళ్తే.. కళ్లకు అద్దాలు, చెవులకు కర్చీఫ్ వంటివి కట్టుకోవాలి.

బండి మీద తిరిగే వాళ్లు హెల్మెట్/టోపీ వంటివి తప్పని సరిగా వాడాలి.

ఎండల్లో తిరిగే వారు స్కిన్ కేర్ కోసం.. సన్ స్క్రీన్ వాడితో మంచిది.

సాధ్యమైతే పెంటౌస్ లో ఉండేవాళ్లు కాస్త కింది ఫ్లోర్లకు మారితే మంచిది.

మిట్ట మధ్యాహ్నం తలుపులు, కిటికీలు మూసుకుంటే వేడిగాలి లోపలికి రాకుండా ఉంటుంది.

ఎండలకు ఆరోగ్యం మరీ ఇబ్బందిగా అనిపిస్తే డాక్టర్ ని కలవడం తప్పనిసరి.