మీ లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలా? ఈ ఆహారాలు తప్పక తీసుకోండి

ఆరోగ్యంగా జీవించాలంటే మంచి తిండి,నిద్రతో పాటు ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉండాలి.

కానీ, ప్రస్తుత కాలంలో చాలామంది ఈ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు.

ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల సమస్య   జలుబు,న్యుమోనియా,క్షయ, ఆస్తమా,క్యాన్సర్,శ్వాసలోపం,ఇన్ఫెక్షన్లు వంటి వివిధ రకాలుగా ప్రమాదానికి దారితిస్తుంది.

కనుక ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆవేంటో తెలసుకుందాం.

గ్రీన్ టీ లో ఉండే క్యాటెచిన్స్,యాంటీ ఆక్సిడెంట్లు ట్లు ఊపిరితిత్తుల పనితీరు,ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అందుకే ప్రతిరోజు గ్రీన్ టీ తీసుకోవాలి.

ఇక విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్,క్రాన్ బెర్రీస్ ను తీసుకోవడం వలన కూడా ఊపిరితిత్తులకు చాలా మంచిదట.

అలాగే  సాల్మన్ చేపలు,వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

అంతేకాకుండా..పసుపుతో కూడిన ఆహారాన్ని తసుకోవడం వలన ఇమ్యునోస్టిమ్యులెంట్ లక్షణాలు శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇక పాల కూరలో  ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

దీంతో పాటు బ్రోకలీ,బ్రస్సెల్స్ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల  కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

అలాగే  నారింజ,నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం