తొలిసారి ఓటు వేస్తున్నారా? ఈ సూచనలు కచ్చితంగా తెలుసుకోండి!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.

ఈ ఎన్నికల్లో చాలా మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

చాలా మంది తొలిసారి తమ ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

అయితే కొత్తగా ఓటు వేయనున్న వారు ఈ సూచలను కచ్చితంగా తెలుసుకోవాలి.

కొత్తగా ఓటు వేసేవారు పోలింగ్ బూత్ ఎక్కడ అనేది ఈసీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలి.

అంతేకాక ఓటర్ హెల్ప్ లైన్ 1950 ద్వారా కూడా పోలింగ్ బూత్ ఎక్కడో తెలుసుకోవచ్చు.

పోలింగ్ బూత్ కౌంటర్స్ వద్ద ఏజెంట్ల ద్వారా మీ ఓటరు స్లిప్పులు తీసుకోవాల్సి ఉంటుంది.

పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఓటరు స్లిప్ ఉండాలి.

ఓటరు స్లిప్ తో పాటు  ఓటరు గర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

పోలింగ్ కేంద్రంలో తొలి అధికారి ఓటరు లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేస్తారు.

పోలింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దు.

అలా ఈవీఎం మేషిన్ వద్ద సెల్ఫీ తీసుకోవడం చట్టరిత్యా నేరం.

పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ మీ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

 ఏదైనా అనుమానం ఉంటే  పోలింగ్ బూత్ లో ఉన్న అధికారిని అడిగి తెలుసుకోవచ్చు.