ఫిబ్రవరిలో నిశ్చితార్ధం

రష్మికతో పెళ్ళి మేటర్ బయటపెట్టిన దేవరకొండ

ఎప్పుడైతే గీత గోవిందం సినిమా తీశారో.. అప్పటి నుంచి రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో నడుస్తుంది అని జనాలు తెగ చర్చించుకోవడం మొదలెట్టారు. 

ఈ మూవీలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పి ఏవేవో లెక్కలు,లాజిక్ లు ముడిపెట్టి సంబంధం ఖాయం చేసేశారు. 

దీనికి ఊతం ఇచ్చేలా ఇద్దరూ వేర్వేరుగా ఒకే లొకేషన్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. 

దీంతో సోషల్ మీడియాకి పిచ్చెక్కిపోయేది. అసలు పెళ్లి చేసుకుంటారా లేదా క్లారిటీ ఇవ్వండి అని గింజుకున్నారు. 

మొత్తానికి విజయ్ దేవరకొండ రష్మికతో పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే విజయ్ ఇక్కడ ఎప్పుడూ ఓపెన్ కాలేదు కానీ జాతీయ మీడియాతో మాత్రం ఓపెన్ అయిపోయాడు. 

రష్మికతో పెళ్లి విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇంకేముంది నేషనల్ మీడియా ఈ వార్తని తెగ వైరల్ చేసేసింది.

ఫిబ్రవరిలో విజయ, రష్మికల ఎంగేజ్మెంట్ ఉంటుంది అని జాతీయ మీడియా తెగ ప్రచారం చేసింది.

దీంతో నిజంగానే ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్థం ఉంటుందేమో అని నమ్మారు.

అయితే దీనిపై విజయ్ స్పందించాడు. ఫిబ్రవరిలో తనకు పెళ్లి గానీ, నిశ్చితార్ధం కానీ జరగడం లేదని అన్నాడు.

ప్రతి ఏటా ఈ మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తుంటుంది.. ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉంటాను. 

నాకు పెళ్లి చేయాలని మీడియా చూస్తుందేమో అని రష్మికతో పెళ్లి, నిశ్చితార్థం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు.