వర్షాకాలంలో అస్సలు తినకూడని కూరగాయలు! డాక్టర్స్ చెప్పని నిజం!

వర్షాకాలం మొదలైందంటే ఆనందంతో పాటు వ్యాధులు ప్రబలుతుంటాయి

పెద్దలు, పిన్నలు తేడా లేకుండా జలుబు, జ్వరం, మలేరియా, డెంగీ, డయేరియా వ్యాధులు చుట్టుముడుతుంటాయి

ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి

అయితే కూరగాయలు, ఆకుకూరలు తింటే సరిపోతుందని భ్రమలో ఉండిపోతున్నారా..? తస్మాత్ జాగ్రత్త

వానకాలంలో కూడా ఈ వెజిటెబుల్స్ తినకుంటే మంచిదని చెబుతున్నారు కొంత మంది ఆరోగ్య నిపుణులు

వానల కారణంగా కొన్ని కూరగాయాల్లో తేమ ఉండి.. బ్యాక్టీరియా, శిలీంద్రాలు, సూక్ష్మ జీవులకు పొదరిల్లుగా మారతాయట.

అలాంటి కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు

మెంతులు, బచ్చలి,పాలకూర వంటి ఆకుకూరలు తినకపోవడమే మేలట. వీటిల్లో సూక్ష్మ జీవులు, బాక్టీరియా పెరుగుతాయట

క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలట. వీటి ఆకులపై పురుగులు ఉండిపోతాయట

అలాగే బీన్స్, బఠానీలు తీసుకోకూడదు. శిలీంద్రాల పెరుగుదలకు అనువుగా ఉంటాయి.

వంకాయలు కూడా వాడకపోవడం మంచిది. స్కిన్ అలర్జీ, వికారం వంటివి వస్తాయట.

 బెల్ పెప్పర్ లకు దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో గ్లూకోసినోలేట్స్ అనే రసాయనం ఉంటుంది

క్యారెట్లు, ముల్లంగి, బీట్‌రూట్‌లు వంటి నేల లోపల పెరిగే కూరగాయలను తినడం ఈ సమయంలో తగ్గించాలి

ప్రకృతి సిద్ధంగా దొరికిన లేదా పెంచిన పుట్టగొడుగులు కూడా ఎవైడ్ చేస్తే మంచిది.

ఈ కాలంలో వీటిని తినడం వల్ల బ్యాక్టీరియా పెరిగి రోగనిరోధక వ్యవస్థపై ప్రభావితం చూపిస్తుందట

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం