Thick Brush Stroke

స్కిన్ లోషన్స్ వాడుతున్నారా? పచ్చి పసుపు ముందు అవన్నీ వేస్ట్!

పసుపు యంటీ బయాటిక్ గా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే.

పసుపులో ఎల్లో పసుపు, నల్ల పసుపు అనే రకాలున్నాయి.

అద్భుతమైన ఔషద గుణాలున్న పసుపును వంటల్లోనే కాకుండా సౌందర్యం కోసం ఉపయోగిస్తున్నారు.

వైద్యంలో కూడా పసుపును వినియోగిస్తున్నారు.

పచ్చి పసుపును వాడితే చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

పచ్చి పసుపును కళ్ల కింద రాసుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది గాయం నయం చేయడంలో సహాయపడుతుంది.

ముఖంపై ఉన్న మచ్చలను వదిలించుకోవడానికి పచ్చిపసుపును అప్లై చేయవచ్చు.

పసుపులో ఉండే సహజ లక్షణాల వల్ల చర్మం మెరుస్తుంది.

పచ్చి పసుపు చర్మాన్ని బలంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.

తామర, అలోపేసియా, లైకెన్ వంటి చర్మ సంబంధిత సమస్యలకు పచ్చి పసుపుతో చెక్ పెట్టొచ్చు.

మొటిమల సమస్యతో బాధపడే వారు పచ్చి పసుపు తింటే తీవ్రత తగ్గుతుంది.

శరీర గాయాలను నయం చేయడంలో కూడా పసుపు సహాయపడుతుంది.

పసుపు బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

పచ్చి పసుపులో కర్కుమిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం