శీతాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే..వీటిని తప్పకుండా తినాలి. అవి ఏమిటంటే..

తృణ ధాన్యాలను ఆహారంగా తీనుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు అని వైద్య నిపుణులు చేప్తున్నారు. అందులో ముఖ్యమైనవి రాగులు.

ఈ రాగుల్లో విటమిన్ బి,కాల్షియం,ప్రోటీన్,ఫైబర్,కార్బోహైడ్రేట్లు అయోడిన్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.

చలికాలంలో రాగులను తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, రక్తహీనత వంటి వ్యాధుల నుంచి వచ్చే ప్రభావం తగ్గుతుంది.

ప్రతిరోజు రాగి పిండితో చేసిన వంటలు,రాగి జావ,రాగి రోటి వంటి వాటిని ఆహారంలో తీసుకుంటే ఫిట్‌నెస్ తో పాటు బరువు తగ్గడానికి సహాయపడఉతుంది.

రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని నయం చేస్తుంది.

అలాగే కడుపు నొప్పి లేదా జీర్ణక్రియ సమస్యలుంటే రాగి ఆధారిత ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

రాగులలో కాల్షియం ఉండటంతో పాటు ఇది  ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.

దీంతో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

రాగుల్లో ఉండే అమినో యాసిడ్‌లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

రాగుల వలన ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి.