రద్దీ లేని బీచ్ లు.. హాలీడే ట్రిప్     గుర్తుండిపోవాలంటే ఇక్కడకు     వెళ్లడం బెస్ట్!

హాలీడే ట్రిప్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చే ప్లేస్ బీచ్ . సముద్రతీరాన ఇసుక తిన్నెల్లో సేదతీరాలని ఎవరికి ఉండదు చెప్పండి.  

 బీచ్ లో సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని చూడటం అద్భుతమైన అనుభూతి అనే చెప్పాలి. వాటర్ గేమ్స్ ఆడటం, షిప్ ల్లో ప్రయాణించడం కోసం కూడా బీచ్ లకు జనాలు క్యూ కడుతుంటారు.

సముద్ర తీరాన కూర్చొని డ్రింక్స్ తాగుతూ చిల్ అయ్యే టూరిస్టులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు.

వేసవి వస్తే చాలు.. చాలా మంది బీచ్ లకు క్యూ కడుతుంటారు. దీంతో అక్కడ తీవ్రమైన రద్దీ నెలకొంటుంది. విపరీతమైన రద్దీ వల్ల ఎంజాయ్ చేయడం కుదరదు. ఈ నేపథ్యంలో రద్దీ లేని బీచ్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మన దేశంలో కొన్ని రద్దీ లేని ప్రశాంతమైన బీచ్ లు ఉన్నాయి. అందులో ఒకటి వెస్ట్ బెంగాల్ లోని మండర్మని బీచ్. మిడ్నాపూర్ జిల్లాలోని ఈ బీచ్ లో జనాల తాకిడి అంతగా ఉండదు.

మహారాష్ట్రలోని తర్కర్లీ బీచ్ లో కూడా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండదు. స్కూబా డైవింగ్ చేయాలనుకునే వారు ఈ బీచ్ ను విజిట్ చేయొచ్చు..

మహారాష్ట్రలోని కొండూర బీచ్ ప్రశాంతతకు నిలయమనే చెప్పాలి. ఈ కొంకణ తీర ప్రకృతి అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

అండమాన్ దీవుల్లోని రాధానగర్ బీచ్ కూడా జనాల తాకిడి పెద్దగా లేని బీచ్ ల్లో ఒకటి. అండమాన్ టూర్ కు వెళ్లే వారు తప్పకుండా ఈ బీచ్ ను విజిట్ చేయాలని ఎక్స్ పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు.

లక్షద్వీప్ లోని బంగారం బీచ్ కూడా బాగా ఫేమస్. సముద్ర అందాలను ఆస్వాదించాలంటే ఇక్కడకు వెళ్లడం బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు.

వెస్ట్ బెంగాల్ లోని మరో ప్రసిద్ధ బీచ్ శంకర్ పూర్. ఇక్కడ చేపట వేట ఎక్కువగా జరుగుతుంది. అందుకే జనాల తాకిడి పెద్దగా ఉండదు.

బీచ్ లు అంటే ఠక్కున గుర్తుకొచ్చే ప్లేస్ గోవా. అయితే అక్కడ ఏ బీచ్ ను చూసినా టూరిస్టులతో సందడిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ గోవాలో జనాల రద్దీ తక్కువగా ఉండే బీచ్ కు వెళ్లాలనుకుంటే బటర్  ఫ్లై బీచ్ కు వెళ్లొచ్చు.