పసుపు పాలా..? పసుపు నీళ్లా..? ఈ రెండింటిలో ఉండే ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవుతారు

పురాతన కాలం నుంచి పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయని అందరికీ తెలుసు.

అందుకే  పసుపును ఆయుర్వేద ఔషధంలో  కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇది ఒక యాంటీ బయోటిక్‌ గా పని చేస్తుంది.

పైగా ఇది మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. కనుక చాలామంది ఈ పసుపును పాలల్లో, నీళ్లలో కలుపుకోని తాగుతారు.

అయితే ఈ రెండింటిలో ఏ ప్రక్రియ వల్ల ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి అనే  సందేహం చాలవరకు ఉంటుంది.

ఇక పసుపును నీళ్లలో కానీ, పాలలో కానీ ఎలా తీసుకున్న మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కనుక పసుపు పాలు తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు, కీళ్ల వాతం ఇంకా వంటి ఇన్ఫ్లమేటరీ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అంటువ్యాధులు రాకుండా సహాయపడుతుంది.

దీంతోపాటు గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.

ఇక పసుపు నీరు అనేది కాలేయాన్ని శుభ్రపరచడానికి, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

దీంతో పాటు  యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల క్లియర్, గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

అలాగే పిత్త ఉత్పత్తిని పెంచడం, జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం