జిమ్ కు వెళ్లకుండానే  ఫిట్ గా ఉండాలంటే  ఈ 10 ఎక్సర్ సైజులు ట్రై చేయండి!

లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల కొత్త రోగాలు వచ్చి పడుతున్నాయి.

 బిజీ లైఫ్ స్టైల్ వల్ల సమయానికి తిండి, నిద్ర అనేది ఉండటం లేదు. ఆలస్యంగా తినడం, తక్కువ సేపు పడుకోవడం వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారు.

జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక మంది ఊబకాయంతో సతమతమవుతున్నారు. కంప్యూటర్ బేస్ట్ జాబ్స్ ఎక్కువ కావడంతో అధిక బరువు అనేది ఇప్పుడు కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది.

అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది జిమ్ లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ కసరత్తులు చేస్తూ కొవ్వు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

జిమ్ ల వల్ల ఫలితం కనిపిస్తున్నా బిజీ లైఫ్ లో అందరూ అక్కడికి వెళ్లడం కుదరదు. కాబట్టి ఇంటి వద్ద ఉంటూ ఫిట్ గా మారే ఎక్సర్  సైజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మీ బాడీలో బ్యాలెన్స్ రావాలంటే లంజెస్ చేయాల్సిందే. ఈ ఎక్సర్ సైజ్ వల్ల బ్యాలెన్స్ రావడమే గాక కాళ్లు మరింత దృఢంగా మారతాయి.

వ్యాయామంలో భాగంగా ఒక కాలును ముందు, మరో కాలును వెనక్కి ఉంచి నడముతో పాటు శరీర పైభాగాన్ని కిందకు వంచాలి. రోజుకు ఒక్కో సెట్ 10 చొప్పున 3 సెట్లు చేయాలి.

అందరికీ తెలిసిన మరో ఎక్సర్ సైజ్ పుషప్స్. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పుషప్స్ లో భాగంగా రెండు కాళ్లను క్రాస్ పొజిషన్ లో ఉంచాలి. 

భుజాలను కిందకు వంచాలి. మెడ మాత్రం ఒకే పొజిషన్ లో ఉండాలి. ఆ తర్వాత మోచేతులను వంచుతూ శరీరాన్ని కిందకు తీసుకెళ్లాలి. ఇది రోజూ మూడు సెట్లు చేయాలి.

మీ కండరాలను బలోపేతం చేయాలంటే డంబుల్స్ తో రోజూ మూడు సెట్ల పాటు ఎక్సర్ సైజ్ చేయాలి. ఒక చోట నిల్చొని రెండు డంబుల్స్ ను రెండు చేతుల్లో పట్టుకోవాలి. 

వాటిని ఇరు భుజాలకు ఎదురుగా పట్టుకొని తల పైభాగం వరకు తీసుకెళ్లి మళ్లీ యథాస్థితికి తీసుకురావాలి.

డంబుల్ రోస్ కూడా మంచి వ్యాయామం. మొదట కాస్త ముందుకు వంగాలి. ఆ తర్వాత రెండు చేతుల్లో డంబుల్స్ పట్టుకొని వాటిని కిందకు తీసుకెళ్లి మళ్లీ పొట్ట భాగం దగ్గరకు తీసుకురావాలి. ఇలా పది చొప్పున మూడు సెట్లు చేయాలి.

డంబుల్స్ తో చేసే మరో ఎక్సర్ సైజ్ సింగిల్ లెగ్ డెడ్ లిఫ్ట్స్. ఇందులో భాగంగా రెండు చేతుల్లో రెండు డంబుల్స్ పట్టుకోవాలి. ఒక కాలును వెనక్కి అంటూ రెండు డంబుల్స్ ను కిందకు వంచాలి. ఆ తర్వాత మళ్లీ యథాస్థితికి చేరుకోవాలి.

ప్లాంక్స్ కూడా ఉపయోగకరమైనదే. దీంట్లో భాగంగా పుషప్ పొజిషన్ లో బాడీని ఉంచాలి. ఆ తర్వాత దీర్ఘ శ్వాస తీసుకోవాలి. 30 సెకన్ల పాటు ఈ పోస్టర్  ను మెయింటెయిన్ చేయాలి. ఇలా రోజుకు మూడు సెట్లు చేయాలి.

నడుము నొప్పితో బాధపడేవారికి  గ్లూట్ బ్రిడ్జ్ ఎక్సర్ సైజ్ ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా ముందు నేల మీద మోకాళ్లతో పడుకొని రెండు చేతులను కింద ఉంచాలి. 

ఆ తర్వాత నడుము భాగాన్ని పైకి లేపాలి. రెండు సెకన్లు పొజిషన్ ను హోల్డ్ చేసి యథాస్థానానికి వచ్చేయాలి. ఇలా పది చొప్పున 3 సెట్లు చేయాలి. ఈ వ్యాయామాలతో పాటు సైడ్ ప్లాంక్స్, బర్పీస్ కూడా సాధన చేస్తే మరింత ఫిట్ గా మారొచ్చు.