ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించే తెగలు! బయటవాళ్ళు వెళ్తే చంపేస్తారా?

ఈ ప్రపంచంలో 100కు పైగా తెగలు మన ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్నాయని.. ఈ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

తమ భూములను, కల్చర్ ని, జీవితాలను కాపాడుకునేందుకు ఈ ప్రపంచం నుంచి వేరుగా ఒంటరిగానే జీవిస్తుంటారు. బయట ప్రపంచం నుంచి మనం అక్కడకు వెళ్తే మన ప్రాణాలకే ముప్పు.

అలాంటి తెగల్లో సెంటినలీస్ తెగ ఒకటి. ఈ తెగ ప్రపంచంలోనే అత్యంత ఒంటరి జీవితాలను జీవించే తెగ. వీరు బయట నుంచి వచ్చే వారితో అస్సలు మాట్లాడరు. వీరి భాష మనకు అర్థం కాదు.

అండమాన్ దీవుల్లోని ఉత్తర సెంటినలీస్ దీవుల్లో జీవించే ఈ తెగ యొక్క జనాభా 50 నుంచి 200 మధ్య ఉంటుందని అంచనా. బతుకు తెరువు కోసం వేటాడడం వీళ్ళ వృత్తి.

2018లో ఒక అమెరికన్ మిషనరీకి చెందిన వ్యక్తి ఈ తెగ నివసించే ప్రాంతానికి వెళ్లి వారి చేతుల్లో హతమయ్యాడు. దీంతో అప్పటి నుంచి ఈ తెగ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.  

ప్యాపువా న్యూ గినీలో యాయిఫో సహా 40 కంటే ఎక్కువ తెగలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నరమాంసం తినడం, తలలు వేటాడటం ఈ తెగల వృత్తి.  

బాహ్య ప్రపంచంతో మాట్లాడేందుకు ఇష్టపడరు. కోరోవై తెగ ఉంది. ఈ తెగ కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతుంటుంది.  

బ్రెజిల్ కి చెందిన కవాహైవా, ఏవా తెగలు, పెరూ దేశంలో ఉన్న మష్కో పిరో తెగ, పారుగ్వై దేశంలో ఉన్న ఏరియో తెగ, ఫిలిప్పీన్స్ లో ఉన్న పలవన్ తెగలు ఇలా ప్రపంచంతో సంబంధం లేకుండా చాలా ఉన్నాయి. వీటిలో మళ్ళీ అనేక తెగలు ఉన్నాయి.  

ఇవన్నీ కూడా సెపరేట్ తెగలు.. మన సాంకేతిక మనుషులంటే వాళ్లకు తెగులు. అందుకే బయట నుంచి ఎవరినీ అనుమతించరు.

ప్రకృతిని నాశనం చేయకుండా, ఒత్తిడి ఫీలవ్వకుండా, ఆరోగ్యంగా ఉంటూ ఉన్నంతలో సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తున్నారు.