పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. ఈ రోజు ఎంతంటే?

ఇటీవల చుక్కలు చూపించిన పసిడి ఇప్పుడు నేల చూపు చూస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు బంగారంపై ప్రభావం చూపుతున్నాయి

ప్రస్తుతం మార్కెట్ లో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఈ మధ్య కాలంలో వివాహాది శుభకార్యాలు ఏవీ లేవు.. దీంతో ధరలు దిగివస్తున్నాయని అంటున్నారు నిపుణులు

గడిచిన మూడు రోజుల నుంచి వరుసగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి బంగారం లాంటి వార్త

ఈ రోజు (మే27) బంగారంపై రూ.10 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 ఉండగా,  24 క్యారెట్ ధర రూ.72,440 వద్ద ట్రెండ్ అవుతుంది.

ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.66,550 ఉండగా,  24 క్యారెట్ ధర రూ. 72,590 వద్ద కొనసాగుతుంది

ముంబై, బెంగుళూర్ లో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 ఉండగా,  24 క్యారెట్ ధర రూ.72,440 వద్ద కొనసాగుతుంది

చెన్నైలో  22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.66,550 ఉండగా,  24 క్యారెట్ ధర రూ.72,600  వద్ద కొనసాగుతుంది

 హైదరాబాద్,విశాఖలో కిలో వెండి ధర రూ.96,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.91,500 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.95,000 వద్ద కొనసాగుతుంది.