జ్ఞాపక శక్తి పెరగాలంటే.. వీటిని అలవాటు చేసుకోండి!

కొందరు త్వరగా వివిధ విషయాలను, ఇతర అంశాలను మర్చిపోతుంటారు.

 జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు కొన్ని పనులను అలవాటుచేసుకుంటే చాలు.

తరచూ క్రాస్ వర్డ్స్ ,సుడుకో వంటి గేమ్స్ ఆడటం వలన మైండ్ పవర్ పెరుగుతుంది.

రోజూ వ్యాయమాలు చేయడం వలన రక్తప్రసరణ బాగా జరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

అలానే రోజు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయాలి

రోజూ  కనీసం ఒక అరగంట పాటు పుస్తకాలను చదవాలి.

నిత్యం మనం చేసిన పనుల్ని ఓ పుస్తకంలో రాస్తూ ఉండాలి

రోజూ కనీసం 30 నిమిషాలు మన చుట్టుపక్కల వారితో కలిసి మాట్లాడాలి.

ఇతరులతో స్నేహపూరిత వాతావరణంలో మాట్లాడటం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల హాయిగా నిద్రపోవాలి

రోజూ కాసేపు సంగీతం వినడం ద్వారా బ్రెయిన్ కి విశ్రాంతి లభిస్తుంది

తరచూ కొత్త స్కిల్స్ ను నేర్చుకుంటుండాలి. తద్వారా బ్రెయిన్ కి పని కలిగి పవర్ పెరుగుతుంది.

అలా పరిపూర్ణమైన నిద్రతో బ్రెయిన్ ప్రెష్ అవ్వడమే కాకుండా పవర్ పెరుగుతుంది.

పై సమాచారం కొందరు మానసిక నిపుణలు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడం జరిగింది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం