స్కూల్స్‌ ప్రారంభం.. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఆహారంలో ఇవి ఉండాల్సిందే

స్కూళ్లు తిరిగి తెరుచుకున్నాయి. పిల్లలు మళ్లీ బడి బాట పడుతున్నారు.

ఇక మరో పది నెలల పాటు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పరుగులు తీయాలి.

చదవుకునే పిల్లలకు మంచి జ్ఞాపకశక్తి ఉండటం ఎంతో అవసరం.

అయితే పిల్లల్లో కొన్ని విటమిన్లు లోపిస్తే.. జ్ఞాపకశక్తి మందగిస్తుంది.

అందుకే వారు తినే ఆహారంలో కొన్ని విటమిన్లు రోజు ఉండేలా చూసుకోవాలి.

శరీరంలో ఉండే ముఖ్యమైన మినరల్స్‌లో జింక్‌ ఒకటి.

ఇది లోపిస్తే.. శరీరం బలహీనపడటం మాత్రమే కాక మతిమరుపు కూడా వస్తుంది.

 జింక్ డీఎన్‌ఏ నిర్మాణం, కణాల అభివృద్ధి, ప్రోటీన్ ఉత్పత్తి, కణజాలాల మరమ్మత్తులో కీలక పాత్ర పోషిస్తుంది.

జింక్‌ లోపం ఉంటే.. పొడి చర్మం, జుట్టు రాలడం, జీర్ణ సమస్యలు, ఎముకల బలహీనతతో పాటు..

తలనొప్పి, మైకం, గోళ్లపై తెల్లటి మచ్చలతో పాటు.. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది.   

ఈ లక్షణాలు కనిపిస్తే.. జింక్‌ లోపం ఉందని అర్థం చేసుకోవాలి.

అప్పుడు పిల్లలకు జింక్‌ అధికంగా ఉండే ఆహారం పెట్టాలి.

మరీ ముఖ్యంగా గుడ్లను ఆహారంలో చేర్చాలి.

దీనిలో జింక్‌తో పాటు.. ప్రొటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.

అలానే జింక్‌ లోపం తలెత్తకుండా ఉండాలంటే.. పిల్లలకు ప్రతి రోజు

ఖర్జూరం, జీడిపప్పు, పాలకూర, మాంసం, తృణధాన్యాలు, అవకాడో, స్ట్రాబెర్రి వంటి పండ్లను వారి ఆహారంలో చేర్చాలి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం