కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్న వారు సేఫ్‌! ఎందుకంటే?

Off-white Banner

 కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా చేసిన ప్రకటన పెను దుమారం రేపింది.

Off-white Banner

కోవిషీల్డ్‌ వేయించుకున్న వారిలో చాలా అరుదైన సందర్భాల్లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని ఆస్ట్రాజెనెకా బ్రిటన్‌ కోర్టు ముందు వెల్లడించిన విషయం తెలిసిందే.

Off-white Banner

ఇండియాలో కోట్ల మంది కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

Off-white Banner

 సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయనే విషయం బయటికి రావడంతో ఆ టీకా వేయించుకున్న వారు ఆందోళనకు గురయ్యారు.

Off-white Banner

అలా ఆందోళన చెందుతున్న వారు, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదని భారతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Off-white Banner

కోవిషీల్డ్ టీకాను పొందిన 1 ప్రతి 10 లక్షల మందిలో 7, 8 మందికి మాత్రమే గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని చెప్పారు.

Off-white Banner

కోవిషీల్డ్‌ గురించి జరుగుతున్న ప్రచారంపై ICMR మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ రమాన్‌ గంగాఖేడ్కర్‌ స్పందించారు.

Off-white Banner

 అది కూడా మొదటి డోసు తీసుకొన్న సమయంలోనే ఉంటుందని రామన్ గంగాఖేద్కర్ చెప్పారు.

Off-white Banner

 రెండో డోసు సమయానికి ఆ రిస్క్‌ పూర్తిగా తగ్గుతుందని, ఏమైనా దుష్ప్రభావాలు చూపిస్తే, తొలి డోస్‌ తీసుకున్న 2, 3 నెలల్లోనే జరుగుతుందని స్పష్టం చేశారు.

Off-white Banner

 భారతదేశంలో దాదాపు 90 శాతం మందికి కోవిషీల్డ్‌ టీకాలు వేశారు.

Off-white Banner

 కానీ, చాలా తక్కువ మందిలో మాత్రమే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించాయని రమాన్‌ పేర్కొన్నారు.

Off-white Banner

 కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న రెండున్నరేళ్ల తర్వాత సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం లేదని, అనవసరంగా భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు.

Off-white Banner

 ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అయితే అవి కాలక్రమేణా మాయమవుతాయని చెప్పారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం