Off-white Banner

అమృతం ఈ నీరు.. రోజూ ఓ గ్లాస్‌ తాగారంటే.. ఆ సమస్యలన్నీ దూరం

ఎండలు మండి పోతున్నాయి. ఇక మే నెలలో సూర్యతాపం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల వల్ల జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉంది అంటున్నారు.

ఇక వడదెబ్బ కారణంగా తెలంగాణలో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఇక వేసవి తాపం తీర్చుకోవడం కోసం చాలా మంది కూల్‌ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తుంటారు.

వీటి వల్ల దాహం తీరకపోగా.. కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

మరి వేసవి తాపాన్ని తీర్చుకోవాలంటే ఏం చేయాలి.. ఏం తాగాలి అంటే.. బర్లీ నీళ్లు అంటున్నారు వైద్యులు.

వడదెబ్బ, డీహైడ్రేషన్, అతిసారం లాంటి వాటికి చెక్ పెట్టాలంటే బార్లీ నీళ్లు

బార్లీ గింజల్లోని పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాక వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

 బార్లీ నీటిలో కాల్షియం, ఫైబర్‌, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నాయి.

వేసవిలో బార్లీ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో ఇప్పుడు చూద్దాం.

గుండె ఆరోగ్యాన్ని పెంచే బార్లీ నీళ్లు..

బార్లీలో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది.

 బీటా-గ్లూకాన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె జబ్బుల సమ్యలు రాకుండా చేస్తాయి.

కడుపు సమస్యలకు వరం బార్లీ..

వేసవిలో చాలా మంది అజిర్తీ, గ్యాస్, కడుపు సమస్యలతో బాధపడుతుంటారు.

అలాంటి వారు బార్లీ నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయం పని మెరుగుపడి.. అజీర్తి సమస్య దూరమవుతుంది.

క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బద్ధకం ఉన్న‌వారు బార్లీ నీరు తాగితే.. వ్యర్థాలన్ని బయటకు పోతాయి.

బార్లీ నీటితో డీహైడ్రేషన్​కు చెక్‌..

బార్లీలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి.

హైడ్రేషన్ సమయంలో శరీరం ఈ ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది.

వీటిని భర్తీ చేయడానికి, శరీరంలో తేమ స్థాయిలను నిర్వహించడానికి బార్లీ నీటిని క్రమం తప్పకుండా తాగాలి.

డయాబెటిస్‌ రోగులకు మేలు చేసే బార్లీ..

బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బీటా-గ్లూకాన్ రక్తప్రవాహంలో చక్కెరను గ్రహించడాన్ని తగ్గించి.. స్పైక్‌లను నివారించి డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గేలా చేస్తుంది బార్లీ వాటర్‌ బెటర్‌..

బరువు తగ్గాలి అనుకునే వారికి బార్లీ వాటర్‌ ఎంతో ఉత్తమం.

ఇది ఆకలిని నియంత్రించే హార్మోన్లను విడుదల చేసేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.

బార్లీ వాటర్ తీసుకున్నప్పుడు కడుపునిండినట్లుండి.. జీవక్రియను పెంచి.. బరువు తగ్గడానికి దోహదం పడతాయి.

రోగనిరోధక శక్తి పెంచే బార్లీ.

బార్లీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇంకా ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టం నుంచి, ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి.

బార్లీ నీరు ఎలా తయారు చేయాలి..

బార్లీని వేయించుకొని లేదా ఎండలో ఆరబెట్టి పొడి చేసుకోని నిల్వ ఉంచుకోవాలి..

ఆ తర్వాత గిన్నెలో నీళ్లు తీసుకుని.. దానిలో రెండు చెంచాల బార్లీ పొడి వేసి కలపాలి..

ఆ తర్వాత నీటిని మరిగించాలి..

ఉడికించిన నీటిని చల్లార్చి వడకట్టుకోని తాగవచ్చు.

లేదా అలా తాగినా మంచిదే.

బార్లీ నీటిలో కొంచెం ఉప్పుతో పాటు మజ్జిగ కూడా కలుపుకుని తాగవచ్చు అంటున్నారు నిపుణులు

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం