పగటి పూట ఈ చిన్న అజాగ్రత్త.. మీ ప్రాణాలు తీసేయచ్చు!

వర్షాకాలం అంటే వానలు ఎంత సాధారణమో.. వ్యాధులు కూడా సర్వ సాధారణం.

అన్ని సీజన్స్ లో కెల్లా వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే వ్యాధులు ఎక్కువగా వ్యాపించేది ఈ వర్షాకాలంలోనే.

ఎక్కువగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే జలుబు, దగ్గు, విష జ్వరాలు వస్తాయి.

అలాగే వీటన్నింటికి మించి దోమల బెడద బాగా పెరిగిపోతుంది.

వర్షాకాలంలో దోమలు దెబ్బకు రాత్రి పూట నిద్రకూడా పట్టదు.

అయితే చాలా మంది ఈ వర్షాకాలంలో చిన్న పొరపాటు చేస్తుంటారు.

రాత్రిపూట దోమలు రాకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటారు.

కానీ.. డెంగ్యూ- మలేరియా వంటి వ్యాధులు వ్యాపిపంజేసే దోమలు పగటి పూటే వస్తాయి.

డెంగ్యూ దోమలు పగటి పూట మాత్రమే కుడతాయి.

అవి కుట్టిన వారం రోజులకు తీవ్రమైన జ్వరం వస్తుంది.

అలా మీకు ఒక్కసారిగా తట్టుకోలేనంత జ్వరం వస్తే మాత్రం అశ్రద్ధ చేయకండి.

అలాగే డి.ఉదయం పూట కూడా దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోం

ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకోకుండా.. నీళ్లు నిలబడకుండా చూసుకోండి.

గమనిక:  ఇది కేవలం అవగాహన కోసం ఇచ్చిన సమాచారం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.