ఈ మొక్క మరణాన్ని తప్ప..  అన్ని వ్యాధులను నయం చేస్తుంది..!

ఈ ప్రకృతిలో ఉన్న చాలా మొక్కలు, చెట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అలాంటి వాటిల్లో ఎంతో ముఖ్యమైన ఓ మొక్క గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం.

ఈ మొక్క ఎంత పవర్‌ఫుల్‌ అంటే.. ఒక్క మరణాన్ని తప్పించి.. అన్ని వ్యాధులను నయం చేస్తుంది

ఇంతకు ఆ మొక్క ఏదంటే.. ఉత్తరేణి. మరి దాని ప్రయోజనాల గురించి

వినాయక చవితికి సమర్పించే వాటిల్లో ఉత్తరేణి ఆకు కూడా ఉంటుంది.

ఈ మొక్క కాండం, ఆకు అన్ని భాగాలు అనేక వ్యాధులకు నివారణకోసం ఉపయోగపడతాయి. 

పాము, తేలు వంటి విషజంతువులు కుట్టినపుడు కూడా ప్రాధమిక చికిత్స కోసం ఇది మంచి ఔషధం..

ఉత్తరేణి కషాయం లేదా రసం కిడ్నీలను శుభ్రం చేస్తుంది.

దీని రసం కఫము, శరీర వాపు, నొప్పులు, గజ్జి, కుష్టిని తగ్గిస్తుంది.

వయసు పెరగకుండా చేసే మెడిసిన్స్‌లో దీన్ని వాడతారు.

ఉత్తరేణి భస్మం అజీర్ణ సమస్యలకు మంచి ఔషధం.

పిచ్చి కుక్క కరవడం వల్ల వచ్చే హైడ్రోఫోబియాకు ఉత్తరేణి విత్తనాల చూర్ణం దివ్య ఔషధం.

ఉబ్బసంతో బాధపడేవారు ఉత్తరేణి సమూల భస్మం ఒక గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే తగ్గుతుంది

ఉత్తరేణి రసంలో దూది తడిపి పిప్పి పంటిలో పెడితే నొప్పి తగ్గుతుంది.

వరసగా జ్వరంతో బాధపడుతుంటే.. ఉత్తరేణి పచ్చి ఆకుకు కొద్దిగా మిరియాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరాలి.

మిశ్రమాన్ని గచ్చకాయలంతా మాత్రలు చేసుకుని తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

 కందిరీగ , తునెటీగ కుట్టినప్పుడు వెంటనే ఈ ఆకుని నీళ్లతో నూరి పలుచగా పూస్తే ఉపశమనం లభిస్తుంది.

అంతేకాదు ఉత్తరేణి ఆకురసంలో ముల్లంగి గింజలు కలిపి నూరి సొరియాసిస్ మచ్చలపై రాస్తే తగ్గుతాయి.

ఇలా ఒక 40 రోజుల్లో వరసగా చేయాలి.

గమనిక:  ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వాడే ముందు వైద్యుడిని సంప్రదించాలి.