షుగర్‌ ఒక శాపం లాంటిది! కానీ.., ఆ పేషెంట్లుకి ఈ కూర ఒక వరం!

కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటాయి.

కొన్ని కూరగాయలు దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తుంటాయి

ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి కొన్ని కూరగాయలు చక్కటి ఔషదంగా పనిచేస్తాయి

చాల మంది గోరు చిక్కుడు ఎంతో ఇష్టంగా రక రకాలుగా వండుకొని తింటుంటారు.

గోరు చిక్కుడు రుచికరంగానే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి

గోరు చిక్కుడు ఎక్కువగా భారత్ లోని పశ్చిమ, వాయవ్య ప్రాంతాలు, పాకిస్థాన్ లో లభిస్తాయి

గోరు చిక్కుడులో ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల మంచి ఆరోగ్యం మీ సోంతం అవుతుంది

ఈ కూరగాయలో  విటమిన్ - , A విటమిన్ - B1, B2, B3, B5, B6, విటమిన్ - C, విటమిన్ - K ఉన్నాయి.

షుగర్ తో బాధపడే వారికి గోరు చిక్కుడు ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

డయాబెటీస్ ఉన్న వారు రెగ్యూలర్ గా తమ డైట్ లో గోరు చిక్కుడు తింటే మదుమేహ సమస్యలు దూరమైతాయంటున్నారు నిపుణులు

ఇందులో కాల్షియం, ఫాస్పరస్ కలిగి ఉండటం వల్ల ఎముకలకు, కండరాలకు బలం ఇస్తుంది.

స్వల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్ధాలు ఉంటాయి.

జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచి.. వ్యర్థాలను బయటకు పంపిస్తాయి.

గోరు చిక్కుడులో హైపోగ్లైసియామిక్ గుణాలు ఒత్తిడి తగ్గిస్తాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం