Tooltip

పరిగడుపున తినాల్సిన ఆహారం ఇదే!

చాలా మంది ఉదయం లేవగానే చేసే పని  టీనో, కాఫీనో తాగడం.

మరికొంతమంది ముందు బ్రేక్‌ ఫాస్ట్‌ చేసి.. తర్వాత టీలు, కాఫీలు తాగి పనికి వెళ్లిపోతారు.

అయితే.. ఉదయం తినే ఆహారం శరీరంపై, మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది.

పరిగడుపున మంచి పోషక ఆహారం తీసుకుంటే.. ఆ రోజంతా యాక్టివ్‌గా ఉండటమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంటారు.

అయితే.. మరి ఉదయం తినాల్సిన మంచి మంచి ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఉదయాన్నే రెండు అరటి పండ్లు తింటే చాలా మంచిది.

అరటి పండులో ఉండే ఫైబర్‌, మిటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మనకెంతో మేలు చేస్తాయి.

ఖర్జూరం కూడా ఉదయాన్నే తింటే ఎంతో మంచింది.

ఆపిల్స్‌ తింటే.. విటమిన్‌ ఏ, బీ, సీ ఈ, కే, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌, ఫైబర్‌, ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తాయి.

పరిగడుపున బాదం తింటే ఎంతో ప్రయోజనం. ఇందులో ఫైబర్‌, విటమిన్‌ ఈ, ప్రొటీన్‌, ఒబేగా3, 6 ఫ్యాటీ యాసిడ్‌, మాంగనీస్‌ ఉంటాయి.

ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గ్రీక్‌ పెరుగు తింటే పొట్ట నిండుగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో గుడ్లు ఉంటే.. అది బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది. ఎగ్స్‌లో ఐరన్‌, విటమిన్‌ డీ, పొటాషియం, జింక్‌ ఉంటాయి.

చియా గింజల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. పరిగడుపున ఇవి తింటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం