వర్షాకాలంలో డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేస్తే చాలు!

గతకొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి.

ఇక ఈ వానలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ రకాల రోగాలు వచ్చే ఆస్కారం ఉంది

ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది

ఇక ఈ డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే..కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు

డెంగ్యూ బారిన పడకుండా ఉండేందుకు వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

డెంగ్యూ దోమలు అపరిశుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి.

నీటి కుంటలను, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చూసుకోవాలి.

నీటి ట్యాంకులు, కంటైనర్ల మూతలను గట్టిగా మూసివేయాలి.

ప్రతివారం నీటిని వినియోగించే వస్తువులను, ముఖ్యంగా కూలర్ వంటి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

రోజూ పడుకునే సమయంలో దోమతెరను వినియోగించాలి

వర్షాకాలంలో  జ్వరం వచ్చినప్పుడు అశ్రద్ద చేయకూడదు.

జ్వరం తగ్గించుకునేందుకు సొంత మందులు తీసుకోవడం మంచిది కాదు.

జ్వరం వస్తే..వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం