Tooltip

ఫ్రీగా దొరికే ఈ కాయ.. షుగర్‌ ఉన్న వాళ్లకు ఓ వరం!

వేసవి కాలంలో మాత్రమే దొరికే అరుదైన కాయ సీమ చింత

వీటిని వివిధ ప్రాంతాల్లో గుబ్బకాయలు, పులి చింతకాయలు అని కూడ పిలుస్తారు

వీటిని తినేందుకు ఏడాదంతా వెయిట్ చేస్తుంటారు

చాలా మంది వీటి  రుచి గురించి తెలియక వదిలేస్తుంటారు. కానీ తినడం స్టార్  చేస్తే అస్సలు వదిలిపెట్టరు

సీమ చింత కాయ తినడానికి  కాస్త వగరుగా ఉంటుంది

కానీ వీటి వల్ల లాభాలు అనేకం ఉన్నాయి.

సీమ చింతకాయల్లో విటమిన్ ఎ, బి, సితో పాటు ఐరన్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి

గొంతు, చిగుళ్లు, నోటి పూతను నివారించే శక్తి వీటికి ఉంది.

బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహార పదార్థం కూడా

జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను కలిగించే సుగుణం సీమ చింతకాయల్లో ఉంది.

ఇవి షుగర్ బారిన పడకుండా కాపాడుతాయి

ఇందులో లభించే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది.

వీటి విత్తనాల నుండి నూనెను తీసి సబ్బుల తయారీలో వినియోగిస్తారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం