బరువు తగ్గాలనుకునేవారికి ఈ రంగు క్యారెట్‌ వరం..

నేటి కాలంలో ప్రపంచంలో ఎక్కువ మంది జనాలను భయపెడుతున్న సమస్య అధిక బరువు.

బరువు పెరగడం ఎంత తేలికో.. తగ్గడం అంత కష్టం.

కడుపు మాడ్చుకుని.. కష్టమైన వ్యాయమాలు చేసినా లాభం ఉండదు కొందరికి.

ఇక బరువు తగ్గడం కోసం చాలా మంది ప్రత్యేకమైన డైట్‌ ఫాలో అవుతారు.

బరువు తగ్గడం కోసం వ్యాయామం ఎంత ముఖ్యమో.. తీసుకునే ఆహారం కూడా అందే ప్రధానం.

బరువు తగ్గాలనుకునేవారు.. ప్రోటీన్‌, ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

అలాంటి కూరగాయాల్లో క్యారెట్‌ ఒకటి. ఇది బరువు తగ్గడానికి మంచి ఆహారం.

దీనిలో కొవ్వు తక్కువగా.. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది.

కేలరీలు కూడా తక్కువే.. పోషకాలు కూడా అధికం.

అయితే వీటిల్లో కూడా కుంకుమ పువ్వు రంగు క్యారెట్లు మంచివి అంటున్నారు.

వీటిని ఉడికించి తిన్నా.. సూప్‌ రూపంలో తీసుకున్నా.. బరువు తగ్గడంలో సాయం చేస్తుంది అంటున్నారు.

పైగా ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. రేచీకటి సమస్యతో పోరాడటానికి సాయం చేస్తాయి.

మలబద్ధకం, విరేచనాల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

వీటిలో చక్కెర శాతం తక్కువ కాబట్టి.. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చు.

వీటిలో విటమిన్‌ C, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం