పిల్లలకు స్కూల్ బ్యాగ్ కొనే ముందు ఇవి తెలుసుకోండి!

పిల్లలకు స్కూల్ బ్యాగ్ కొనే ముందు ఇవి తెలుసుకోండి!

1, 2వ తరగతి పిల్లలకు ఒకటిన్నర కిలో లోపు బరువు ఉండే బ్యాగ్ కొనాలి. 

3వ తరగతి పిల్లల స్కూల్ బ్యాగ్ 2 కిలోల లోపు ఉండాలి. 4, 5వ తరగతి పిల్లల స్కూల్ బ్యాగులు 2 కిలోల నుంచి 3 కిలోల లోపు ఉండాలి.

6,7,8వ తరగతి పిల్లల స్కూల్ బ్యాగులు 3 నుంచి 4 కిలోల లోపు ఉండాలి.

9,10వ తరగతి స్కూల్ పిల్లలకు బ్యాగ్ బరువు 5 కిలోల కంటే మించకూడదు.

బాగా చిన్న పిల్లలకి మాత్రం తక్కువ బరువు ఉండే స్కూల్ బ్యాగులు మంచిది.

పిల్లలు ట్యాబ్స్ వంటివి స్కూల్ కి తీసుకెళ్తున్నట్లయితే యాంటీ థెఫ్ట్ స్కూల్ బ్యాగులు కొన్నివ్వడం బెస్ట్.

లెదర్ బ్యాగ్స్ బరువుగా ఉంటాయి. వర్షంలో తడిస్తే త్వరగా ఆరవు. కాబట్టి వీటిని కొనివ్వకపోవడమే బెస్ట్.

వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అయితే బెస్ట్. వర్షంలో తడిచిన లోపల బుక్స్ తడవవు.

తక్కువ బుక్స్, ఎక్కువ బుక్స్ తగ్గట్టు బ్యాగ్ సైజుని అడ్జస్ట్ చేసుకునేలా అడ్జస్టబుల్ బ్యాగ్స్ కొనడం బెస్ట్.